డిపెండింగ్ టీ 20 వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వేదికగా ఈ సంవత్సరం వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ టైటిల్ కోసం మొత్తం 12 జట్లు పోటీ పడుతున్నాయి. సూపర్ 12 మ్యాచ్ లు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని జట్ల విజయాలను వర్షం డిసైడ్ చేస్తోంది. ఈ టైటిల్ ఫేవరెట్ గా మొదటి నుండి అనుకున్న జట్లలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ లు ఉన్నాయి. ఇక ఇవి కాకుండా అండర్ డాగ్స్ గా భావించే పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా లకు కూడా చాన్సు ఉంది. ఇదిలా ఉంటే మరికొద్ది సేపట్లో సిడ్నీ వేదికగా ఇండియా మరియు నెదర్లాండ్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది.

ఇండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చివరి బంతిలో ఓడించి మంచి జోరు మీద ఉండగా, నెదర్లాండ్ మాత్రం తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఓడిపోయి విజయం కోసం ఆడనుంది. అయితే ఈ టోర్నీకి అర్హత సాధించిన ప్రతి టీం కూడా అసాధారణమైనవే అని చెప్పాలి. ఏ జట్టు ఎప్పుడు ఎవరిని ఓడిస్తుంది అన్నది ఊహించలేము. అందుకు సరైన ఉదాహరణ నిన్న ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ ల మ్యాచ్... పూర్తి ఓవర్ లు జరిగుంటే పరిస్థితి ఏమిటో అన్నది పక్కన పెడితే... ఆ సమయానికి ఇంగ్లాండ్ కన్నా అయిదు పరుగులు ఎక్కువ ఉండడంతో ఐర్లాండ్ గెలవడం సూపర్.

అందుకే ఇండియా కూడా తన ప్రత్యర్థి నెదర్లాండ్ ను తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా జట్టులో మార్పులు కూడా చేయడం మంచిది కాదన్నది కొందరి క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలం అయిన రాహుల్, రోహిత్ మరియు సూర్యకుమార్ యాదవ్ లకు మంచి అవకాశం అని చెప్పాలి. ఓపెనింగ్ కుదురుకోవలసిన అవసరం ఎంతకైనా ఉంది, రోహిత్ మొదటి రెండు మూడు ఓవర్లలో నిదానంగా ఆడుతూ కుదురుకున్నాక తన సహజమైన ఆటపై దృష్టి పెడితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: