సాధారణంగా దేశ వాలి టోర్నీలలో ద్వైపాక్షిక సిరీస్ లలో టి20 ఫార్మాట్లో మ్యాచ్ జరిగితే ఎంతో మంది బ్యాట్స్మెన్లు సెంచరీలు చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ అటు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నిలలో  సెంచరీలు చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కోవడమే కాదు ఇంకోవైపు తీవ్రమైన ఒత్తిడ్ని కూడా జయించాల్సి ఉంటుంది. ఇక ఇలా ఒత్తిడిని జయించి అటు సెంచరీ  చేయాలని దూకుడుగా ఆడినప్పటికి పరిస్థితులు కూడా అనుకూలించాలి. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు సెంచరీకి చేరువైనప్పటికీ 90 లలోనే వికెట్ కోల్పోతూ చివరికి నిరాశ లో మునిగిపోతూ ఉంటారు.


 ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీలలో సెంచరీలు చేసిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు అటు సెంచరీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇకపోతే ఇటీవలే బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రుస్సో 56 బంతుల్లో 19 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఈ టి20 వరల్డ్ కప్ లో పదవ శతకాన్ని నమోదు చేశాడు. ఇలాంటి సమయంలో ఇక వరల్డ్ కప్పులో ఇప్పటివరకు సెంచరీలు సాధించిన అటకాళ్లు ఎవరు అన్నది చర్చకు వచ్చింది.


 2007లో టి20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పై వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్  శతకం బాధి టి20 వరల్డ్ కప్ లో మొదటి శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత 2010లో దక్షిణాఫ్రికా పై భారత ఆటగాడు రైనా 101 పరుగులతో సెంచరీ మార్క్ అందుకున్నాడు   ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున టి20 వరల్డ్ కప్ లో మూడంకల స్కోర్ అందుకున్న ఒకే ఆటగాడు రైనా ఒక్కడే కావడం గమనార్హం.  వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (2012లో బంగ్లాదేశ్‌పై 123), అలెక్స్‌ హేల్స్‌ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్‌), అహ్మద్‌ షెహజాద్‌ (2014లో బంగ్లాదేశ్‌పై 111 నాటౌట్‌), తమీమ్‌ ఇక్బాల్‌ (2016లో ఓమన్‌పై 103 నాటౌట్‌), క్రిస్‌ గేల్‌ (2016లో ఇంగ్లండ్‌పై 100 ), జోస్‌ బట్లర్‌ (2021లో శ్రీలంకపై 101 ) టి20 వరల్డ్ కప్ లో శతకాలు సాధించిన ప్లేయర్లుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: