టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. చివరి బంతి వరకు విజేత ఎవరో కూడా తేల్చలేని విధంగా మారిపోతుంది. అదే సమయంలో కొన్ని జట్లకు అటు వరుణుడు కూడా షాక్ ఇస్తూ ఓటమిని శాసిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లలో ప్రేక్షకులు  ఊహించుని ఫలితాలు వస్తూ ఉండటం గమనార్హం. కాగా ఇటీవల పాకిస్తాన్ జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది.


 పాకిస్తాన్ లాంటి బలమైన జట్టు అటు పసికూన జింబాబ్వేను ఎంతో అలవోకగా ఓడించి తీరుతుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ బౌలర్లు జింబాబ్వేను 130 పరుగులకే కట్టడి చేశారు. దీంతో పాకిస్తాన్ విజయం మరింత సులభం అయింది అని భావించారు. కానీ ఊహించని రీతిలో జింబాబ్వే బౌలింగ్ విభాగం పాకిస్తాన్పై విరుచుకుపడింది అని చెప్పాలి.  దీంతో జింబాబ్వే బౌలింగ్ దాటికి చేతులెత్తేసిన పాకిస్తాన్ బ్యాటింగ్ విభాగం చివరికి తక్కువ టార్గెట్ కూడా ఛేదించలేక విజయాన్ని ప్రత్యర్థి చేతిలో పెట్టేసింది  ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్ ఓటమిపాలైంది. పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పులు పెట్టి ముచ్చెమటలు పట్టించిన ఈ ఆల్ రౌండర్ అటు పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి కావడం గమనార్హం.. సికిందర్ రాజా బౌలింగ్ వచ్చేంతవరకు కూడా 13 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది పాకిస్తాన్. కానీ సికిందర్ రజా రావడం రావడమే ఏకంగా మూడు వికెట్లను తీసేసాడు. మంచి ట్రాక్ లో ఉన్న షాదబ్ ఖాన్ ను పెవిలియన్  చేర్చాడు. తర్వాత బంతికే హైదర్ అలీని గోల్డెన్ డకౌట్  గా పేవిలియన్ పంపాడు.  ఇక 16 ఓవర్ రెండో బంతికి టాప్ స్కోరర్ గా ఉన్న షాన్ మసూద్ సైతం తెలివైన బంతితో  బోల్తా కొట్టించి పాకిస్తాన్ ను కష్టాల్లోకి నెట్టాడు. ఇక మ్యాచ్ మొత్తానికి కూడా మంచి ఫామ్ లో కనిపిస్తున్న షాన్ మసూద్ అవుట్ కావడమే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: