వరల్డ్ కప్ మన ఊహలకు అందకుండా ఏమేమో జరిగిపోతున్నాయి. చిన్న దేశాలు ఛాంపియన్ టీం లను గుక్క తిప్పుకోనివ్వకుండా ఓడిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ లాంటి జట్టును ఐర్లాండ్ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఓడించింది. ఇది నిజంగా వరల్డ్ కప్ లో ఉన్న జట్లు అందరికీ ఒక డేంజర్ బెల్ లాంటిది. ఈ సంచలనం జరిగి రెండు రోజులు అయినా కాకముందే నిన్న మరో సంచలనం నమోదు అయింది. గ్రూప్ 2 లో భాగంగా పాకిస్తాన్ మరియు జింబాబ్వే ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక్క రన్ తేడాతో ఎర్విన్ సేన అందరినీ షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు సభ్యులు, యాజమాన్యం మరియు అభిమానులు ఈ సంచలనాన్ని ఊహించలేదు సరికదా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ ఓటమితో పాక్ వరల్డ్ కప్ ఆశలు ముగిసినట్లే లెక్క. అయితే ఈ ఓటమిపై ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతూ పాకిస్తాన్ పై నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఒక జట్టు గెలుపు లేదా ఓటమిలో పూర్తి బాధ్యత ఎవరిదైనా ఉంది అంటే... అది ఒక్క జట్టు కెప్టెన్ కి మాత్రమే. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ను వరల్డ్ కప్ కు ముందు వరకు రన్ మెషిన్ అని, విరాట్ కోహ్లీ కన్నా గొప్ప అని కంపేర్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే స్థాయిలోనే బాబర్ ఆట ఉన్న మాట వాస్తవమే.. అయినప్పటికీ ఒక్కసారిగా వరల్డ్ కప్ కు వచ్చేసరికి బాబర్ కు ఏమైంది. ఎందుకు పదే పదే తడబడుతున్నాడు... తన ఆట కెప్టెన్సీ వలన ఎఫెక్ట్ అవుతోంది అంటే మిగిలిన చాలా టీం ల కెప్టెన్ లు ఆటను కెప్టెన్సీ ని సరిగా చూసుకుంటున్నారు.

ఇండియాతో మ్యాచ్ లో కీలక బ్యాట్స్మన్ గా ఉన్న బాబర్ డక్ అవుట్ గా తాను ఆడిన మొదటి బంతికే ఎల్బీడబ్ల్యు అయ్యాడు. ఇక అదే మ్యాచ్ లో ఇండియా ఒక దశలో నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంటే... అయిదవ వికెట్ ను తీయలేక ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ తర్వాత మళ్ళీ గేమ్ లో పుంజుకునే అవకాశం వచ్చినా ఆఖరి ఓవర్ స్పిన్ కు ఇచ్చి బౌలింగ్ వనరులను సరిగా వాడుకోవడంలో విఫలం అయ్యాడు. ఇక నిన్న మ్యాచ్ లోనూ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి నెమ్మదిగా బాల్ టు బాల్ ఆడితే గెలిచే మ్యాచ్ లో కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన వారు కూడా జింబాబ్వే బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. అలా వరల్డ్ కప్ లో ఇంత దారుణ ప్రదర్శనకు కెప్టెన్ బాబర్ ఆజామ్ ఒక్కడే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: