సికిందర్ రజా.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇటీవలే ప్రపంచ కప్ లో భాగంగా జింబాబ్వే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన సికిందర్ రజా పాకిస్థాన్ ను దెబ్బ కొట్టాడు. ఏకంగా పాకిస్తాన్ మూలాలు ఉన్న ఈ ఆటగాడు పటిష్టమైన పాకిస్తాన్ ఓటమిని శాసించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  మ్యాచ్ దాదాపు పాకిస్తాన్ వైపు తిరిగింది అనుకుంటున్న తరుణంలో సికిందర్ రజా అద్భుతం చేసి చూపించాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మరుసటి ఓవర్లో మరో వికెట్ పడగొట్టి ఇక మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇలా పాకిస్తాన్ ఓటమిని శాసించి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు సికిందర్ రజా. అయితే ఈ జింబాబ్వే ఆల్ రౌండర్ ఇంతలా రెచ్చిపోయి ఆడి జట్టుకు విజయాన్ని అందించడం వెనక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు అన్న విషయం ఎవరికైనా తెలుసా..  ఆ ఆటగాడి విజయం వెనుక రికీ పాంటింగ్ ఉండడం ఏంటి అది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారు కదా.. రికీ పాంటింగ్ వీడియోలను చూసి అటు సికిందర్ రజా ఎంతగానో స్ఫూర్తి పొందాడట.


 రికీ పాంటింగ్ పాకిస్తాన్ తో మ్యాచ్కి ముందు జింబాబ్వే ఆటగాళ్లను ఉద్దేశిస్తూ స్ఫూర్తిని ఇచ్చే వ్యాఖ్యలు చేసాడు. నాకు తెలిసిన ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ తెలియని ఆటగాళ్లు బాగా రాణించాలని కోరుకుంటున్న. ఒత్తిడిని తట్టుకుని మీరు విజయం సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్న అంటూ రికీ పాంటింగ్ తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలనే స్ఫూర్తిగా తీసుకున్న సికిందర్ రజా బాగా రాణించాలని నిర్ణయించుకున్నాడు. ఇక అన్నీ కలిసి వచ్చి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించ.. అందుకు రికీ పాంటింగ్ కు థాంక్స్ చెప్పుకోవాలి అంటూ సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: