ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంత ఉత్కంఠ బరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఎలా ప్రదర్శన చేస్తున్నాడు అన్న విషయాన్ని అటు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు అంచనాలను అందుకోవడం కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. ఇక మరి కొంతమంది ఆటగాళ్లు మాత్రం అంచనాలను అందుకోలేకపేలవ ప్రదర్శన చేస్తూ చివరికి జట్టును కష్టాల్లోకి నడుతూ ఉండడం గమనార్హం.


 అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అటు మైదానంలో హోరాహోరీగా తలపడుతున్న ఆటగాళ్లు.. మరోవైపు ఎంపైర్లు మాత్రమే క్రికెట్ ప్రేక్షకులకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఇక అటు ప్రేక్షకులు గమనించేది కూడా ఇలాంటివారిని అని చెప్పాలి. కానీ మ్యాచ్ సజావుగా జరగడం వెనక అటు ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు కావాల్సిన సదుపాయాలను అందించడం వెనక అటు సిబ్బంది శ్రమ ఎంతో ఉంటుంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 వర్షం కారణంగా కాసేపు మ్యాచ్ రద్దు అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం మళ్లీ మ్యాచ్ మొదలు కావడంతో భారత బౌలర్లు అద్భుతం చేసి చూపించారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు భారత జట్టులో ఉన్న ఒక వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ. అతడే భారత జట్టు సిబ్బంది లో ఒకడైన రఘు. వర్షం పడి గ్రౌండ్ మొత్తం తడిగా ఉండడంతో భారత ఫీల్డర్లు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జారిపడే అవకాశాలు ఏర్పడ్డాయ్. ఇలాంటి సమయంలోనే ఏకంగా రఘు గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఆటగాళ్ల షూస్ కి అంటుకున్న బురదను బ్రష్ తో శుభ్రం చేస్తూ ఇక వారు జారిపడకుండా ఎంతగానో శ్రమించాడు. దీంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: