ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సూపర్ 12 మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక సెమి ఫైనల్లో అర్హత సాధించే జట్లు ఏవి అన్న విషయంపై అందరిలో ఉత్కంఠ ఉంది. అయితే ఇప్పటికే గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ జట్టు దాదాపు సెమీస్ లో స్థానాన్ని కన్ఫార్మ్ చేసుకుంది. ఇక గ్రూప్ వన్ నుంచి రెండవ స్థానంలో సెమీఫైనల్ అవకాశం దక్కించుకోవడానికి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య పోటీ జరుగుతుంది అని చెప్పాలి. మరోవైపు  గ్రూప్ 2 లో ఆరు పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న టీమిండియా జింబాబ్వే పై విజయం సాధిస్తే ఇక టాప్ ప్లేస్ లోకి వచ్చి ఇక సెమీస్ అవకాశాలను కన్ఫార్మ్ చేసుకుంటుంది.


 ఈ క్రమంలోనే గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకోబోయే జట్లు ఏవి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇస్తున్న రివ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ తన రివ్యూ ను చెప్పేసాడు. నిజం చెప్పాలంటే మెల్బోర్న్ వేదికలో ఎవరు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారో ఎవరికి తెలుసు. గ్రూప్ దశ నుంచి అధికమించి ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే దక్షిణాఫ్రికా కాస్త డేంజరస్. అయినప్పటికీ గతంలో తాను చెప్పినట్లుగా ఫైనల్ మాత్రం ఆస్ట్రేలియా భారత్ల మధ్య ఉంటుంది అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.



 ఆస్ట్రేలియా జట్టు కొన్ని విభాగాల్లో వెనకబడి ఉందని.. అదే సమయంలో రోహిత్ సేన బుమ్రా  లాంటి కీలక బౌలర్ ను కోల్పోయిందని.. అయితే ఇరుజట్లు కూడా టోర్నీ రెండో భాగంలో అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రికి పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఇక నవంబర్ 13వ తేదీన ఫైనల్ చూసేందుకు తాను ఆత్రుతగా ఉన్నానని.. ఇక మెల్బోర్న్ వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తాను అంటూ రికీ పాంటింగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: