ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తానం గురించి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే భారత జట్టులోకి ఒక సాదాసీదా ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇక ఇప్పుడు దిగ్గజ క్రికెటర్ గా మారడం వరకు అతని ప్రస్థానాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అందరిలా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు ఏకంగా ప్రపంచ క్రికెట్ ని ఏలే ఆటగాడిని అన్న విషయాన్ని విరాట్ కోహ్లీ తన ఆట తీరుతోనే నిరూపించాడు.  ప్రతి విషయంలో కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ.


 అయితే క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనిలేదు.  ఏకంగా జట్టుకు విజయాన్ని అందించడం కోసం కోహ్లీ అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసి చూపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. సాధారణంగా కోహ్లీ స్టార్ క్రికెటర్గా ఎదిగిన తర్వాత అతనికి ఆటపట్ల ఉన్న అంకితభావం గురించి క్రికెట్ ప్రపంచానికి అర్థమైంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయకముందే కోహ్లీ క్రికెట్ పట్ల తన అంకితభావం ఏంటో అన్న విషయాన్ని ప్రపంచానికి రుజువు చేశాడు.


 2006 డిసెంబర్ 18వ తేదీన ఉదయం సమయంలో నూనుగు  మీసాల కోహ్లీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇక మ్యాచ్ లో బాగా రాణించేందుకు కోహ్లీ కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలాడు. కానీ అంతలో ఊహించని చేదువార్త. తనను వెన్ను తట్టి ముందుకు నడిపించిన తండ్రి ఇక లేడు అన్న విషయం కోహ్లీకి తెలిసి గుండె పగిలిపోయింది. ఆ సమయంలో కోహ్లీ ప్లేస్ లో ఎవరున్నా కన్నీరు పెట్టుకుంటూ తండ్రి అంత్యక్రియలకు వెళ్లేవారు. కానీ కోహ్లీ మాత్రం తండ్రి కోరికను నెరవేర్చాలని.. తనను నమ్ముకున్న జట్టును గెలిపించాలని కొండంత బాధను గుండెల్లో దాచుకొని క్రికెట్ ఆడాడు. ఏకంగా ఆ మ్యాచ్ లో 90 రన్స్ చేసి ఢిల్లీని గెలిపించి.. చివరికి తన తండ్రి అంత్యక్రియలు చేసేందుకు వెళ్లాడు. ఇలా 18 ఏళ్ల వయసులోనే కోహ్లీ కమిట్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం క్రికెట్ ప్రపంచానికి అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: