టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 లో ఉన్న ఒక్క సెమీఫైనల్ స్థానం కోసం మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికీ ఈ టోర్నీలో సెమీస్ కు చేరుకున్న మొదటి జట్టుగా న్యూజిలాండ్ అవతరించింది. ఇంకా మూడు సెమిస్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో జస్ట్ మిస్ వరల్డ్ సంచలనం జరిగేది. కానీ ఆసిస్ బౌలర్లు చివరికంటా పోరాడి జట్టుకు నాలుగు పరుగుల విజయాన్ని కట్టబెట్టారు. దీనితో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకోవాలంటే ఈ రోజు శ్రీలంక మరియు ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోవాలి. అలా కాకుండా ఇంగ్లాండ్ కనుక గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంగ్లాండ్ సెమీస్ కు చేరుకుంటుంది. ఈ టోర్నీకి ఆతిధ్యం ఇచ్చిన జట్టు కావడంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు వెళ్లాలని ఆశపడుతోంది. కానీ డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియా వేరే జట్ల విజయాలపై ఆధారపడవలసి రావడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి.

ఇకపోతే ఈ రోజు మ్యాచ్ గురించి చెప్పుకోవాలంటే సిడ్నీలో మధ్యాహ్నం 1 .30 గంటలకు స్టార్ట్ కానుంది. రెండు రోజుల ముందు ఇదే గ్రౌండ్ లో మ్యాచ్ జరిగింది. ఈ పిచ్ పై మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ మ్యాచ్ లో శ్రీలంక కన్నా కూడా ఇంగ్లాండ్ ఎక్కువ ఒత్తిడిలో ఉంటుంది. ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఆ ఒత్తిడిలో కొన్ని పొరపాట్లు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పొరపాట్లే శ్రీలంక విజయానికి మెట్లు కాగలవు. అయితే పిచ్ ఎలా ఉన్నా శ్రీలంక కనుక టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకోవాలి. లంకకు ఉన్న స్పిన్ అస్త్రాలను బ్యాట్సమన్ కు అనుకూలంగా వాడితే ఇంగ్లాండ్ కు ఓటమి తప్పదు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్పీడ్ ఆడినట్లుగా స్పిన్ ఆడలేరు. ముఖ్యంగా ఈ గేమ్ లో బట్లర్, లివింగ్స్టన్, మొయిన్ అలీ, సామ్ కరన్ లను అడ్డుకుంటే శ్రీలంక గెలిచినట్లే. శ్రీలంక ప్రధాన బౌలింగ్ వనరులు అయిన హాసరంగా, తీక్షణ , కుమార మరియు రజిత లు కీలకం కానున్నారు. ఇక బ్యాటింగ్ లో ఎప్పటిలాగే మెండిస్ , నిస్సంక , రాజపక్స మరియు శనక ల మీదనే లంక అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు సైతం ఈరోజు శ్రీలంక కు చీర్స్ చేయనున్నారు. వారు గెలిస్తేనే ఆస్ట్రేలియా సెమిస్ కు వెళ్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: