ప్రపంచ కప్ లో కీలకమైన సెమీఫైనల్ పోరు కోసం అటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇక సెమి ఫైనల్లో అవకాశం దక్కించుకున్న నాలుగు జట్లు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి సిద్ధమవుతున్నాయి. తమ ప్రత్యార్థులను ఎలా ఓడించాలి అనేదానిపై ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ చూపు కూడా నవంబర్ పదవ తేదీన జరగబోతున్న ఇంగ్లాండ్, భారత్  మ్యాచ్ పైనే ఉంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కి ప్రారంభానికి ముందు నుంచి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అభిమానులు కూడా తమ అంచనాలను, అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉన్నారు.


 తుది జట్టులో చోటు దక్కించుకుపోయే ఆటగాళ్లు ఎవరు అన్న విషయంపై కూడా పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావనకు తీసుకువస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన మాటలు ప్రకారం టీమ్ ఇండియాలో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్లో రెండు మార్పులు ఉండడం ఖాయం అన్నది ప్రస్తుతం అందరి అంచనా. ఇటీవల జింబాబ్వే  తో జరిగిన మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్ పెద్దగా తన బ్యాటింగ్ తో ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో మళ్లీ దినేష్ కార్తీక్  జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.


 అదే సమయంలో జట్టులో స్థానం దక్కించుకుంటున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఒకవైపు స్పిన్ బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అదే  సమయంలో  మ్యాచ్ వేదిక అయిన ఆడిలైట్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అక్షర పటేల్ ని పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ చాహల్ ను తుదిచెట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఎన్నో రోజుల నుంచి జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న చాహల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదరగొట్టే ఛాన్స్ ఉందని అభిమానులు అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: