కొన్ని రోజుల నుంచి ప్రపంచ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్య కుమార్ యాదవ్.. టీమిండియాలో అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శనకి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఫిదా అవుతున్నారు. అతను బౌలర్ల పై సృష్టించే విధ్వంసానికి అందరూ ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఇక మైదానం నలువైపులా అతను ఆడుతున్న అద్భుతమైన షాట్లను చూసి మంత్రముగ్ధులు  అయిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా గత కొంతకాలం నుంచి సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న అద్భుతమైన ఇన్నింగ్స్ లో ప్రపంచ క్రికెట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సరికొత్త చర్చకు దారితీస్తూ ఉన్నాయి అని చెప్పాలి. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టి20 ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ వన్ గా కూడా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన సూర్యకుమార్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి  అందరూ ఆసక్తి చూపుతున్నారట. ఈ క్రమంలోనే సూర్య కుమార్ కు సంబంధించిన ఒక విషయం గురించి అందరూ తెగ వెతికేస్తున్నారట.


 అదేంటో తెలుసా.. సూర్య కుమార్ యాదవ్ ఏం చదువుకున్నాడు అని. సూర్య కుమార్ యాదవ్ ఎంతవరకు చదువుకున్నాడు అనే విషయాన్ని నేటిజెన్లు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  ఒక ఆ వివరాలు చూసుకుంటే.. సూర్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడట. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను కంప్లీట్ చేశాడట. ఇక ముంబైలోని పిల్లయ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, అండ్ కామర్స్ నుంచి సూర్య కుమార్ ఆటో డిగ్రీ పొందాడు అన్నది తెలుస్తుంది. బీకాం గ్రూప్ తీసుకుని డిగ్రీని పూర్తి చేశాడట సూర్యకుమార్. సూర్యకుమార్ ను చిన్నప్పుడే బ్యాడ్మింటన్ లేదా క్రికెట్ ఎంచుకోవాలని అతని తండ్రి సూచిస్తే ఇక సూర్యకుమార్ క్రికెట్ వైపు అడుగులు వేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: