కాసేపటి క్రితమే టీ 20 వరల్డ్ కప్ 2022 లో సెమీఫైనల్ 2 మ్యాచ్ ముగిసింది. రెండు వండర్ ఫుల్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ కాస్త ఏకపక్షముగా పూర్తి అయింది. ఈ తరహా ఓటమిని ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క ఇండియా అభిమాని కూడా కలలో అయినా ఊహించి ఉండరు. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అనుకున్న సమయంలోనే ఇంగ్లాండ్ అన్ని విభాగాలలో పూర్తి ఆదిపత్యం చూపించి రోహిత్ సేనను మట్టి కరిపించింది. ఇండియా నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే ఈ స్కోర్ ను ఇండియా కాపాడుకుంటుంది అనుకున్నా ఎందుకో బౌలర్లు అంతా చేతులెత్తేయడంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా మార్ నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేధించింది. దీనితో ఇండియా ఇంటిముఖం పట్టగా ఇంగ్లాండ్ మెల్బోర్న్ లో ఆదివారం పాకిస్తాన్ ను ఫైనల్ లో ఢీకొట్టనుంది. అయితే ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూసిన ఇండియాకు ఏ ఏ కారణాలు దోహదపడ్డాయి అన్నది ఇప్పుడు చూద్దాం.

టాస్ ఓడిపోవడం : టాస్ విషయంలో మన ప్రమేయం ఉన్న లేకపోయినా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మాత్రం ప్రధాన కారణం టాస్ ఓడిపోవడమే అని చెప్పాలి. కీలకం అయిన సెమిఫైనల్ మ్యాచ్ లో పిచ్ స్వభావం ఏ విధంగా ఉన్నా ఛేజింగ్ అయితే మనకు ఉన్న బ్యాటింగ్ డెప్త్ కు చూసుకుంటూ ఆడితే విజయం దక్కే అవకాశాలు ఉండేవి. కానీ టాస్ ఓడిపోవడం ఇంగ్లాండ్ కు ప్లస్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలవగానే ఫీల్డింగ్ తీసుకుని మంచి నిర్ణయం తీసుకోవడంతోనే సగం గెలిచారు అని చెప్పాలి.

రోహిత్ అండ్ కో బ్యాటింగ్ లో వైఫల్యం : ఈ టోర్నీలో గెలిచిన మ్యాచ్ లలో ఎక్కువ భాగం కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్ లు రాణించడం వలనే, కానీ మిగిలిన వారు అంటే కెప్టెన్ రోహిత్ శర్మ , రాహుల్ , హార్దిక్ పాండ్యలు దాదాపుగా అంచనాలకు తగినట్లు మాత్రం రాణించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెదర్లాండ్ తో మ్యాచ్ లో మినహా పరుగులు చేయడంలో తడబడుతూనే ఉన్నాడు. ఆఖరికి ఎంతో కీలకం అయిన ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ టచ్ లోకి వచ్చినట్లే కనిపించినా అనవసర షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ కూడా రెండవ ఓవర్ లోనే అవుట్ అయ్యి తాను ఇంకా ఫామ్ లో లేడని చాటి చెప్పాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా అన్ని మ్యాచ్ లలో ఆడి సెమీఫైనల్ మ్యాచ్ లోనే అవుట్ అయ్యాడు. కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యాలు ఆడకుంటే ఆ మాత్రం స్కోర్ అయినా చేసేవాళ్ళు కాదు.

బౌలర్లు వైఫల్యం : 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను ఇండియా బౌలర్లు ఏ దశలోనూ వికెట్ తీయడం కాదు కదా కనీసం ఇబ్బంది పెట్టలేకపోయారు. నిన్నటి వరకు గుడ్ బౌలింగ్ అటాక్ అంటూ చెప్పుకున్న భువి , అర్ష్ దీప్ మరియు షమీ లు పూర్తిగా తేలిపోయారు. కనీసం ఒక్క వికెట్ ను కూడా తీయలేక ధారాళంగా పరుగులు సమర్పిచుకున్నారు. ఇండియా ఓటమిని శాసించిన మూడు కారణాలు అంటే ఇవే అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: