ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత ఎంత ఘోరమైన వైఫల్యాన్ని చదివి చూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు లీగ్ దశలో అన్ని మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులకు దీటుగా పోటీ ఇచ్చింది భారత జట్టు. ఈ క్రమంలోని వరుసగా విజయాలు సాధించింది అని చెప్పాలి.. ఇకపోతే ఇక ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం భారత జట్టు చివరికి చేతులెత్తేసి ఘోర ఓటమి చవిచూసి సెమీఫైనల్ లో ఎంతో అలవోకగా విజయం సాధించి ఫైనల్ అడుగుపెడుతుంది అనుకున్న ఇండియా జట్టు ఇక అన్ని విభాగాల్లో వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు విజయం అందించే ప్రదర్శన చేసింది



 అయితే ఈసారి కొత్త కెప్టెన్ రోహిత్ సారధ్యంలో భారత జట్టు విశ్వవిజేతగా నిలుస్తుందని భారత అభిమానులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ అటు అభిమానులందరికీ కూడా నిరాశ ఎదరైంది అని చెప్పాలి. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఫైనల్ కు వెళ్లి ఉంటే మరోసారి భారత్ tjపాకిస్తాన్ మ్యాచ్ జరిగి ఉండేది అని కొంతమంది భావిస్తూ ఉంటే వరల్డ్ కప్ లో వరుసగా అందరూ ఆటగాళ్ల వైఫల్యమే జట్టు ఓటమికి కారణమైన అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.


 ఇదిలా ఉంటే ఇక ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించే టి20 వన్డే వరల్డ్ కప్ లలో సెమీ ఫైనల్ ఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్లలో టీమ్ ఇండియా ఎన్నిసార్లు ఓడిపోయి వెనతిరిగింది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది ఇక వివరాలు చూసుకుంటే..

 2014 టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు వచ్చి ఓటమి చవి చూసింది.
 2017 వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ లోనే ఓటమిపాలై ఇంటి బాట పట్టింది

 2016లో టి20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరీ లోకి దిగి ఇక సెమి ఫైనల్లో ఓటమితో వెనితిరిగింది అని చెప్పాలి

 2017లో ఎంతో పటిష్టంగా కనిపించిన టీమిండియా కప్పు గెలిచేలాగే కనిపించింది కానీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఓటమిపాలయింది.


 ఇక 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా ఓడిపోయింది. ఇక ఇటీవల  జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా చేతులెత్తేసి ఓటమి చవి చూసింది టీమిండియా. ఇక ఇప్పుడు ఈ ఏడాది వరల్డ్ కప్ లో కూడా మళ్లీ సెమి ఫైనల్ పోరులో ఓడిపోయి చివరికి ఇంటి బాట పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: