ప్రస్తుతం భారత క్రికెట్ లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఎందుకు సెమీఫైనల్ లో విజయం సాధించలేకపోయింది అన్నదాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. సెమిఫైనల్ విజయం సాధించకపోవడం గురించి అటు ఉంచితే.. సెమీఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్ లలో అటు ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు కనీస పోటీ ఇవ్వకపోవడమేంటి అని అందరూ ఆశ్చర్యం లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.. ఎందుకంటే సెమీఫైనల్ లో భాగంగా టీమిండియా తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది.



 ఇక టీమిండియా ఇంత ఘోర పరాభవాన్ని చవిచూడటాన్ని అటు టీమిండియ అభిమానులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవరు ఊహించిన విధంగా ఎన్నో విషయాలను కూడా తెరమీదకి తీసుకువస్తూ విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటి బాట పట్టడంపై ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఇందులోకి లాగుతు కొంతమంది టీమిండియా అభిమానుల విమర్శిస్తూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోవడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా.


 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీమిండియా మూడు వరల్డ్ కప్ లు సాధించింది. 1983లో మొదటిసారి వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఇక మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే 2007, 2011, వరల్డ్ కప్ లతో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సాధించింది. కానీ బిజెపి అధికారంలోకి వచ్చాక మోడీ పీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా టీమిండియా వరల్డ్ కప్ సాధించలేదని  కొంతమంది వింత కారణాన్ని తెరమీదకి తీసుకువస్తున్నారు. అయితే క్రికెట్కు రాజకీయాలకు సంబంధం ఏంటి అని మరికొంతమంది ఇక ఇలాంటి ట్రోల్స్ పై మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Pm