ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ప్రత్యర్థి జట్లను వణికించే టీమ్ గా కొనసాగుతుంది టీమిండియా.. ఏకంగా వరల్డ్ కప్ ముందు వరకు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్లలో విజయం సాధిస్తూ తిరుగులేదు అని నిరూపించింది. ఇక టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉంటే.. 15 ఏళ్ల నిరీక్షణకు తప్పకుండా తెర దించుతుంది అని అందరూ అనుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి ఇక టీమిండియా కప్పు కైవసం చేసుకోవడం ఖాయం అని ఎంతో మంది భావించారు.

 కానీ టీమిండియా విజయంలో అందరూ పెట్టుకున్న అంచనాలను తారుమారు చేసింది రోహిత్ సేన. లీగ్ దశ మ్యాచ్లలో వరుస విజయాలతో దూసుకుపోయిన రోహిత్ సేన అటు సెమీఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ కు కనీస పోటీ ఇవ్వలేక చివరికి ఘోర వైఫల్యాన్ని చవిచూసి ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ఓటమి పై అటు బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. తద్వారా ఇక జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లు అందరికీ కూడా స్వస్తిపలికి యువ ఆటగాళ్లతో టీం ని పటిష్టంగా మార్చాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ గా మారిపోయింది.


 ఇలా టి20 వరల్డ్ కప్ లో ఓటమి నేపథ్యంలో రానున్న రోజుల్లో జట్టులో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. టి20 కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను ఇక టి20 లకు రెగ్యులర్ కెప్టెన్ గా మార్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఒక టాక్ బయటికి వచ్చింది. అంతేకాదు ఇక వచ్చే టి20 వరల్డ్ కప్ లో సీనియర్లను జట్టులో ఆడించే అవకాశం లేదు అన్నది కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా అందరిని పక్కకు పెట్టకుండా క్రమక్రమంగా ఒక్కొక్కరిని తప్పించి యువ ఆటగాళ్లకు  ఛాన్స్ ఇచ్చి జట్టును పటిష్టంగా మార్చుకోవాలని భావిస్తుందట టీమిండియ  యాజమాన్యం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: