టీమిండియా అంటే ఎంత పట్టిష్టమైన జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి టీమిండియాను అటు దరిద్రం వెంటాడుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అవును అని సమాధానమే ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తుంది. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా లీగ్ దశలో టీమిండియా వరుస విజయాలతో దూసుకు వచ్చి.. అతి కష్టం మీద సెమిస్ లో అవకాశం దక్కించుకున్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. అయితే 2013లో ధోని సారధ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ ని గెలవలేదు టీమిండియా.


 అయితే 2007, 2011 వరల్డ్ కప్ లు గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీకి సైతం 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇక మళ్ళీ ఐసీసీ ట్రోఫీ అందించడం సాధ్యం కాలేదు అని చెప్పాలి. 2017లో టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ తో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన భారత జట్టు చివరికి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇక 2019లో వన్డే వరల్డ్ కప్ లో కూడా గ్రూప్ స్టేజిలో ఏడు మ్యాచ్ లలో గెలిచి టాపర్గా నిలిచిన కోహ్లీ సేన చివరికి సెమీఫైనల్ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. 2021 టీ20 వరల్డ్ కప్ తో పాటు ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లోను టీమ్ ఇండియా ఓడిపోయింది.


 ఇక కోహ్లీ సారధ్యంలో ఐసీసీ ట్రోఫీ గెలవడం లేదని రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన కెప్టెన్గా ఉన్న రోహిత్ కు సైతం వరల్డ్ కప్ టైటిల్ అందించడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక కొత్త విషయం తెరమీదకి తీసుకొస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. 2014 నుంచి టీమ్ ఇండియాకు దరిద్రం పట్టుకుంది. ఎందుకంటే అప్పుడే కేఎల్ రాహుల్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను బాగా రాణిస్తున్న అతను జట్టులో ఉండడంతో జట్టును మాత్రం బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉందని అందుకే ఐసీసీ ట్రోఫీ గెలవలేక పోతున్నారని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. రాహుల్ జట్టులో ఉన్నప్పుడు ధోనికే సాధ్యం కాలేదు.. ఇక కోహ్లీ, రోహిత్ లకు ఎలా వరల్డ్ కప్ గెలవడం సాధ్యమవుతుంది అని చర్చించుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: