ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా కప్పు కొట్టి తీరుతుంది అని గట్టిగానే ఫిక్స్ అయ్యారు టీమిండియా అభిమానులు. కానీ ఊహించని రీతిలో అందరి నమ్మకాన్ని వమ్ము చేసింది టీమిండియా. లీగ్ దశలో మంచి ప్రదర్శన కనపరిచి సెమి ఫైనల్లో అడుగు పెట్టిన టీమ్ ఇండియా.. సెమిస్లో మాత్రం అదే మ్యాజిక్ కొనసాగించ లేకపోయింది. అతి కష్టం మీద అటు సెమి ఫైనల్లో అవకాశం దక్కించుకున్న ఇంగ్లాండు చేతిలో ఏకంగా ఘోర పరాభవాన్ని చూసింది. ఎక్కడ ఇంగ్లాండ్ కు కనీస పోటీ ఇవ్వలేక 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది అని చెప్పాలి.


 ఇక సెమి ఫైనల్ ఓడిపోవడం కారణంగా చివరికి ఇక ఇంటి బాట పట్టింది టీమిండియా. దీంతో అటు టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది అనుకుంటే రోహిత్ సేన ఇలా చేసిందేంటి అంటూ ఎంతోమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో బాగానే రాణించినప్పటికీ బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాం అంటూ చెప్పాడు. అదే సమయంలో తన పేలవమైన బ్యాటింగ్ గురించి మాత్రం మాట్లాడలేదు.


 ఈ క్రమంలోనే మరోసారి ఇక భారత క్రికెట్ అభిమానులందరూ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనినీ గుర్తు చేసుకుంటున్నారు. కెప్టెన్ అంటే ధోనిలా ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 2012లో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో టీమిండియా సరైన ప్రదర్శన చేయలేక ఓడిపోయిన సమయంలో ధోని చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఓడిన సమయంలో ప్రెస్ మీట్ లో ధోని ఎవరిని నిందించకుండా. తానే ప్రధాన దోషిని.. అంటూ కామెంట్ చేశాడు. ఇలా ఏ కెప్టెన్ కూడా తనని తాను నిందించుకోడు.. ఇప్పుడు రోహిత్ కూడా తన పేలవ ప్రదర్శన గురించి మాట్లాడలేదు. అందుకే కెప్టెన్ అంటే ధోనిలా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: