15 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతుంది అనుకున్న టీమ్ ఇండియా సెమి ఫైనల్ లోనే చాప చుట్టేసి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా అటు సెమీఫైనల్ లో మాత్రం చేతులెత్తేసింది. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆటగాడిగా కెప్టెన్ గా విఫలం అవడంపై ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు.


 ఏకంగా భారత మాజీ ఆటగాళ్లు సైతం ఇక రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ గురించి అతనికి కెప్టెన్సీ గురించి స్పందిస్తూ.. ఇక కాస్త ఘాటుగానే విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఇటీవల కాలంలో తరచూ సారధులను మారుస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు..


 ఇటీవలే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం గురించి ఒక క్రీడా చానల్ తో మాట్లాడాడు అజయ్ జడేజా. నేను చెప్పే మాటలు రోహిత్ శర్మకు బాధ కలిగించవచ్చు. కానీ నిజానికి కెప్టెన్గా జట్టును తీర్చిదిద్దుకోవాలంటే మాత్రం కనీసం ఏడాది పాటు జట్టుకు నిర్విరామంగా అందుబాటులోనే ఉండాలి. కానీ రోహిత్ శర్మ ఈ ఏడాదిలో ఎన్ని సిరీస్ లకు కెప్టెన్ గా ఉన్నాడు. జట్టుకు నాయకుడు అనేవాడు ఒక్కడే ఉండాలి ఏడుగురు కెప్టెన్లు ఉంటే కీలక సమయాల్లో గెలుపొందడం కష్టం అంటూ బీసీసీఐపై విమర్శలు గుర్తించాడు. అసలు టీమిండియాలో  ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అంటూ వాపోయాడు. కాగా  ఇటీవల జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు విశ్రాంతి ప్రకటిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: