ప్రపంచంలో క్రికెట్ క్రీడకు ఎంత ఆదరణ దక్కుతున్నదో మనకు తెలుసు. పైగా ఇంతకు ముందు మాత్రం కేవలం కొన్ని దేశాలకే పరిమితం అయిన ఈ ఆటను ఆడడానికి చాలా దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఏ స్పోర్ట్ కి అయినా నియంత్రణ మండలి ఉండనే ఉంటుంది. ఆ క్రీడకు సంబంధించిన ఇయర్ కేలండర్, టోర్నమెంట్ లు, ఆటగాళ్ల కాంట్రాక్టు లు ఇలా అన్ని విషయాలు వారి పరిధిలోనే ఉంటాయి. అదే విధంగా క్రికెట్ కు కూడా ఒక నియంత్రణ మండలి ఉంది... దానిని ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య) అంటారు. ఈ ఐసీసీలో అధ్యక్షుడు మరియు ఇతర పాలక మండలి ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తిస్తూ ఉంటారు.

కాగా ఈ ఐసీసీ కి అధ్యక్షుడు గా ఉన్న వారిమీద మాత్రం అధిక భారం ఉంటుంది. ఈ పదవి దక్కాలంటే అంత ఆషామాషీ కాదు... గత కొంతకాలంగా ఐసీసీ అధ్యక్ష పదవి గురించి చాలా వార్తలు హల్ చల్ చేశాయి. ఈ పదవి దక్కాలంటే ఐసీసీ ఎన్నికను నిర్వహిస్తుంది... ఈ ఎన్నికలో పోటీచేసే వారికి ఐసీసీ సభ్యుల మద్దతు ఉండాలి. తాజాగా అందుతున్న సమాచార ప్రకారం కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఎన్నిక పూర్తి అయి అధ్యక్షుడిని కూడా ఎన్నుకున్నారట. అయితే ఎటువంటి షాక్ లేకుండా ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న గ్రెగ్ బార్క్ లే మళ్ళీ ఎన్నికవడం విశేషం. ఐసీసీ అధ్యక్ష పదవికి ఎవ్వరూ పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా  గ్రెగ్ బార్క్ లే  ఎన్నికయ్యారు.

కానీ నిన్నటి వరకు అధ్యక్ష పదవి రేస్ లో ఉన్న జింబాబ్వే క్రికెట్ బోర్డు చైర్మన్ టవెంగ్వా ముకుహ్లాని పోటీ నుండి తప్పుకోవడంతో గ్రెగ్ బార్క్ లే కు లైన్ క్లియర్ అయింది. ఇక మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవికోసం పంపనున్నట్లు బీసీసీఐ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎందుకో ఆఖరి నిముషంలో తన పేరును పంపలేదు. అలా వరుసగా రెండవసారి గ్రెగ్ బార్క్ లే ఐసీసీ అధ్యక్ష పదవికి ఎంపికయ్యాడు. గతంలో 2020 నవంబర్ లో అధ్యక్ష పదవి చేపట్టిన గ్రెగ్ బార్క్ లే ఇప్పుడు రెండవసారి అధ్యక్షుడు అయ్యాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: