ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఓపెనర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ - కేఎల్ రాహుల్ జోడి ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. లీగ్ దశలో టీమిండియా వరుస విజయాలు సాధించి అటు సెమీఫైనల్ చేరింది అంటే అందుకు కేవలం విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా లాంటి ప్లేయర్ల ఆటతీరే కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ వరుస మ్యాచ్లో విఫలం అవుతూ వచ్చాడు. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా ఒక్క మ్యాచ్లో కూడా భారత ఓపెనర్లు  50 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయలేకపోయారు అని చెప్పాలి.


 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ జోడి చేసిన అత్యధిక భాగస్వామ్యం కేవలం 27 పరుగులు మాత్రమే కావడం గమనార్హం . అది కూడా పసికూన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మాత్రమే ఇది సాధ్యమైంది. ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో కూడా పది బంతుల్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి చేసింది కేవలం రెండు పరుగులు మాత్రమే. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి  జోడి ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అత్యధిక తక్కువ రన్ రేట్ నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా చెత్త రికార్డు సృష్టించింది.


  2014 టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ జోడి 5.82 రేటు తో మాత్రమే పరుగులు చేశారు. అప్పుడు కూడా కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. అంతకంటే ముందు 2010లో టి20 వరల్డ్ కప్ లో గంభీర్ - మురళి విజయ్ ఓపెనింగ్ జోడి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే 5.34 మాత్రమే రన్ రేట్ నమోదు చేశారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం అత్యల్పంగా రోహిత్ శర్మ - కే ఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడి 4.9  మాత్రమే రన్ రేట్ నమోదు చేయడం గమనార్హం. అయితే పవర్ ప్లే లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ఈ ఇద్దరు పై వేటు వేసి కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వాలని ఎంతో మంది మాజీ ఆటకాల్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: