క్రికెట్కు పుట్టినిల్లు అయినా ఇంగ్లాండ్ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో ఎంతలా ట్రోల్స్ ఎదుర్కొనేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్కు పుట్టినిల్లు అని చెప్పు కోవడమే తప్ప ప్రపంచ క్రికెట్ లో అటు ఇంగ్లాండ్ జట్టు పెద్దగా రానించింది మాత్రం ఏమీ లేదు. రికార్డులు క్రియేట్ చేసింది కూడా తక్కువే అని ఎంతో మంది ఇంగ్లాండ్ పై ట్రోల్స్ చేస్తూ ఉండే వారు అని చెప్పాలి. అయితే అటు ద్వైపాక్షిక సిరీస్లలో అదర గొట్టే ఇంగ్లాండ్ జట్టు ఇక అటు ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ లకు వచ్చే సరికి మాత్రం పేలవ   ప్రదర్శన చేస్తూ చతికిల బడుతూ ఉండేది. ఏకంగా ఒత్తిడికి తల వంచుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉండేది. ఇలా 2010 ముందు వరకు కూడా క్రికెట్ కు పుట్టినలు అని చెప్పు కోవడం తప్ప ఇప్పటి వరకు ఒక్క ప్రపంచం కూడా గెలవ  లేదు అని అందరూ విమర్శలు చేశారు.


 ఇంగ్లాండ్ ప్రదర్శన కేవలం మామూలు టోర్నమెంట్ల లో తప్ప వరల్డ్ కప్ లో ఉండదు అని ఎంతో మంది విమర్శలు గుప్పించారు. కానీ 2010లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ ఏకంగా విమర్శలు చేస్తున్న వారి నోర్లు మూయించింది అని చెప్పాలి. ఇక టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ ఆట తీరులో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇక ప్రపంచ క్రికెట్లో ఆదిపత్యాన్ని కొనసాగిస్తూ విశేషం గా రాణిస్తూ వస్తుంది ఇంగ్లాండు జట్టు. అయితే మళ్లీ 2019లో కూడా వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రపంచ క్రికెట్లో రెండు టీ20 వరల్డ్ కప్ లు ఒక వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది ఇంగ్లాండ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: