బీసీసీఐ నిర్వహణలో గత 15 సీజన్ లుగా ఎంతో సక్సెస్ లుగా ఐపీఎల్ జరిగింది. 14 సీజన్ ల పాటుగా ఐపీఎల్ లో కేవలం ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీ పడగా, గత సీజన్ లో మాత్రం మొత్తం పది జట్లు పోటీ పడి కొత్తగా ఐపీఎల్ ఆరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ కప్ ను గెలుచుకుంది. గత కొన్ని రోజుల నుండి ఐపీఎల్ 2023 లో జరగనున్న సీజన్ 16 కోసం మినీ ఆక్షన్ కొచ్చి లో జరుగనుంది. అయితే ఇప్పటికే ఫ్రాంచైజీలతో ఉన్న ఆటగాళ్లను రిటైన్ మరియు రిలీజ్ కోసం బీసీసీఐ రేపు సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చింది. అందుకే దాదాపుగా అన్ని జట్లు తమకు వద్దు అనుకున్న వారిని వేలానికి వదిలేశారు.

మరి కొన్ని జట్లు తమ ప్లేయర్ లతో మిగిలిన జట్ల ప్లేయర్ లను భర్తీ చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు చెందిన ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ మాత్రం తాను ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదని షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించి తన అభిమానులకు మరియు ఫ్రాంచైజీ కేకేఆర్ కు నిరాశను మిగిల్చాడు. ఇతనిని కేకేఆర్ రెండు కోట్ల రూపాయలు పెట్టి గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ లో బిల్లింగ్ కేవలం 8 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. కీపర్ గా జట్టులో ఉన్న షెల్డన్ జాక్సన్ మరియు బాబా అపరాజిత ల వలన బిల్లింగ్స్ కు ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు.

కాగా బిల్లింగ్స్ వచ్చే ఐపీఎల్ సీజన్ కు దూరం కావడానికి కారణం ఇంగ్లాండ్ లో జరగనున్న దేశవాళీ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని లాంగ్ టైం క్రికెట్ లో రాటుదేలడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. కాగా కేకేఆర్ జట్టు యాజమాన్యం ఈ లోటును ఏ ప్లేయర్ తో భర్తీ చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: