ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో టీమ్ ఇండియా ఓడిపోవడంపై అటు మాజీ ఆటగాళ్లు ఎంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీస పోటీ ఇవ్వలేక 10 వికెట్ల తేడాతో ఓడిపోవడాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి  ఈ క్రమంలోనే బీసీసీఐ ఆటగాళ్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై.. ఇక కొంతమంది ఆటగాళ్లు తరచూ విశ్రాంతి తీసుకుంటూ ఉండడంపై కూడా స్పందిస్తున్నారు మాజీ ప్లేయర్స్.


 ఇక ఎప్పుడూ జట్టు ప్రదర్శన పై జయాపజాయాలపై కూడా తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయే భారత లెజెండరీ ప్లేయర్, ప్రస్తుత కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఇక భారత ఓటమిపై గత కొన్ని రోజుల నుంచి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. కాగా బాగా ఆడని ఆటగాళ్లకు వేతనం తిరిగి ఇవ్వాలని రూల్ పెడితే అందరూ మంచి ప్రదర్శన చేస్తారు అంటూ ఇటీవల బీసీసీఐకి ఒక్క సలహా ఇచ్చాడు సునీల్ గవాస్కర్. ఇక ఇప్పుడు మరోసారి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండే పరిస్థితుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల కంటే సపోర్టు స్టాప్ ఎక్కువ అయ్యారు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.. ఇది జట్టులోని ఆటగాళ్లను గందర గోళానికి గురిచేస్తుంది అంటూ తెలిపాడు. జట్టుకు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు ఇక ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదని ఇక ఇద్దరూ వేరు వేరు సలహాలు ఇవ్వడం కారణం గా ఎవరి సలహాలు పాటించాలో తెలియక ఆటగాళ్లు గందరగోళానికి గురవుతారు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇలా సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉంటే ఎవరి సూచనలు వినాలో ఆటగాళ్లకు అర్థం కాదు అంటూ సునీల్ గవాస్కర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: