ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఊహించని విధంగా ఫైనల్ వరకు చేరిన పాకిస్తాన్ జట్టు కప్పు గెలుస్తుంది అని ఆదేశ అభిమానులు అందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.  కానీ ఊహించిన రీతిలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు కేవలం రన్నరఫ్  గా మాత్రమే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఫైనల్ లో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లందరూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్ సరిగా లేకపోతే ఆటగాళ్లు ఎలా సరిగా ఆడుతారు అంటూ కాస్త ఘాటు గాని విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఆ జట్టు కోచ్ మాథ్యూ  హెడేన్ మాత్రం జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పై ప్రశంసలు కురిపించాడు.



 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ప్రదర్శన పై సంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మా ఆటగాళ్లు ఎక్కడ వెనకడుగు వేయలేదు. ప్రతి గేమ్ కోసం కూడా నెట్స్ లో ఎంతగానో చెమటోడ్చారు. బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా ఏదైనా సరే ఇక్కడ వరకు వచ్చినందుకు మా ఆటగాళ్లకు అభినందనలు తెలపాల్సిందే. మీ ప్రదర్శనతో ప్రతి ఒకరిని గర్వపడేలా చేశారు. మీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ మాథ్యూ  హెడేన్ అని చెప్పుకొచ్చాడు. ఇక 2023 నాటికి భారత్ వేదికగా జరిగే వన్ డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని  చెప్పుకొచ్చాడు.

 టి20 వరల్డ్ కప్ లో తప్పకుండా పాకిస్తాన్ కప్పు గెలుస్తుందని భావించా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే తప్పకుండా పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్ సగర్వంగా ఎత్తుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు జట్టులో బయటపడిన బలహీనతలను అధిగమించి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో తప్పకుండా గెలిచి ఒక అప్పుడు మరిన్ని ఎక్కువ సంబరాలు చేసుకుంటాం అంటూ మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. మాథ్యూ హెడెన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: