ఒకప్పుడు క్రికెట్ లో ఉన్న మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కేవలం ఒకే వ్యక్తిని నియమించేవారు. కానీ ఇప్పుడు మాత్రం క్రికెట్లో కొత్త ట్రెండు కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా క్రికెట్లో ఒక్కో ఫార్మాట్ కి కూడా ఒక్కో కెప్టెన్ నియమిస్తూ.. ఇక జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునే దిశగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీని టెస్ట్ ఫార్మాట్ కూ కెప్టెన్ గా నియమించి రోహిత్ శర్మను వన్డే, టి20 ఫార్మాట్ కు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.


 దీంతో అటు విదేశీ జట్లలో కొనసాగుతున్న ట్రెండు భారత క్రికెట్ లోకి కూడా పాకి పోయిందని ఇప్పటినుంచి ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కెప్టెన్ ను చూడబోతున్నామని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇక మళ్ళీ మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇకపోతే రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాడు అన్నమాటే కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో మాత్రం ఉండలేదు. తరచూ అతనికి సెలెక్టర్లు విశ్రాంతి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక ఒక్క పర్యటనలో ఒక్కో యువ ఆటగాడు భారత జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు.


 ఇకపోతే ఇలా తరచూ కెప్టెన్లను మార్చడం కారణంగానే ఇటీవల వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయింది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో టెస్ట్లు, వన్డేలు, టీ20 ఫార్మాట్లకు తగినట్లు వేరువేరు జట్లను తయారు చేయాలని టీమిండియా కు సూచించాడు.. ఇక మూడు ఫార్మాట్లకు కోచ్ లను కూడా వేరువేరుగా నియమించాలి అంటూ చెప్పాడు. టి20 ల కోసం స్పెషలిస్టులు ఉంటేనే ఎంతో మంచిది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇదే విధానాన్ని ఇంగ్లాండు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు పాటిస్తున్నాయని ఇక భారత క్రికెట్ లో కూడా ఇలాంటి ట్రెండ్ తీసుకురావాలని ఆల్రౌండర్లను పెంచాలని సూచించాడు అనిల్ కుంబ్లె.

మరింత సమాచారం తెలుసుకోండి: