టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ గెలుచుకొని స్వదేశానికి వస్తుంది అనుకున్న టీమిండియా ఇక సెమి ఫైనల్లో విజయం సాధించలేక నిరాశతోనే టీమ్ ఇండియాకూ పయనం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు వరకు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్లలో ప్రత్యార్థులపై ఆదిపత్యాన్ని  ప్రదర్శించి సిరీస్ లను గెలుచుకున్న టీమిండియా ఎందుకో వరల్డ్ కప్ లో మాత్రం అంత ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. ముఖ్యంగా సెమీఫైనల్ లో అయితే ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు కనీస పోటీ ఇవ్వలేక పది వికెట్ల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇలా టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయి ఇక భారత అభిమానులు అందరినీ కూడా నిరాశపరచడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ టీమ్ ఇండియాలో ఉన్న లోపాలను తెరమీదకి తీసుకువస్తూ ఎండగడుతున్నారు. అదే సమయంలో ఇక టీమిండియా ఆటగాళ్లను బీసీసీఐ కన్ఫ్యూజన్లో పడేస్తుంది అంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరును కూడా తప్పుపడుతూ ఉండడం గమనార్హం. తరచు ఆటగాళ్ళకు విశ్రాంతి ఇవ్వడం వల్లే ఇలాంటి సమస్య వస్తుంది అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ లో సెమీఫైనల్ పరాజయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఒకవేళ తాను గనుక సెలెక్టర్ల కమిటీ చైర్మన్గా ఉండి ఉంటే మాత్రం తక్షణమే 2024 టీ20 వరల్డ్ కప్ కోసం హార్దిక్ పాండ్యాను టీమిండియా కెప్టెన్ గా నియమిస్తాను అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా జట్టులో ఫాస్ట్ బాల్, సెమీ ఆల్రౌండర్లు ఉండడం ఎంతో కీలకం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 1983 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2007 టి20 వరల్డ్ కప్ లలో విజేతగా టీమిండియా నిలిచింది అంటే దానికి జట్టులో ఎక్కువమంది ఆల్రౌండర్లు ఉండడమే కారణం అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: