గత 15 సీజన్ ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఆనందింపచేస్తున్న లీగ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ లీగ్ లో పాల్గొని ఎందరో అనామక క్రికెటర్లు తమ తమ దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆడి గుర్తింపును తెచ్చుకున్నారు. అదే విధంగా కొందరి క్రికెటర్ల కెరీర్ లు సైతం ఈ ఐపీఎల్ వలనే ముగిసిపోయింది. అయితే ఈ లీగ్ వలన ప్లేయర్లు లాభపడినా నష్టపోయినా బీసీసీఐ కు మాత్రం కాసులపంటే అని చెప్పాలి. సీజన్ సీజన్ కు ఐపీఎల్ తన బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ పోతోంది. ఈ ఐపీఎల్ లో ఆడదానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆటగాళ్లు తమ దేశం తరపున ఆడడాన్ని కూడా త్యాగం చేశారు.

అలాంటి ఎంతో మంది ఆటగాళ్లలో ఒకరు వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ కుడిచేతి వాటం బౌలర్ మరియు బ్యాట్స్మన్ కీరన్ పోలార్డ్. పోలార్డ్ గురించి ఈ ప్రపంచానికి పరిచయం అవసరం లేదు. ఎటువంటి బౌలర్ ను అయినా అలవోకగా సిక్సర్ కొట్టగల విద్వంసకారుడు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పోలార్డ్ 13 ఐపీఎల్ సీజన్ ల అద్భుతమైన బంధం తర్వాత ఐపీఎల్ లో ఆటగాడిగా తన శకం ముగిసినట్లు ప్రకటించాడు. ఇది విన్న అభిమానులు పోలార్డ్ ను ఇక ఐపీఎల్ లో చూడలేమా అంటూ చింతిస్తున్నారు. పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరపున 13 సీజన్ లుగా ఆడుతూ వస్తున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ తనను మినీ వేలంలోకి వదలడమే ఈ నిర్ణయానికి కారణం అంటూ కొందరు అంటున్నారు.

అయితే అభిమానులు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. పోలార్డ్ కేవలం ఒక ప్లేయర్ గా ఐపీఎల్ మాత్రమే ఆడడం లేదు. మిగిలిన ఏ దేశవాళీ లీగ్ లలో అయినా ఆడదానికి సిద్దంగానే ఉంన్నాడు. పైగా త్వరలో జరగనున్న యూఏఈ లీగ్ లోనూ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరపున ఆడనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ కోచ్ గా తన అనుభవాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. సో... ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ సక్సెస్ లో భాగం అయిన పోలార్డ్, బ్యాటింగ్ కోచ్ గా కూడా సక్సెస్ అవుతాడా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: