ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ సీజన్లో ఎన్నో చాంపియన్ జట్లు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాయి అన్న విషయం తెలిసిందే. అంతకుముందు సీజన్ వరకు కూడా ఎంతో పటిష్టంగా కనిపించిన కొన్ని జట్లు ఇక మెగా వేలం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లను వదులుకోవాల్సి రావడంతో బలహీనంగా మారిపోయాయ్ అని చెప్పాలి. ఇక ఏ జట్టు కూడా ఆశించిన విధంగా రాణించలేకపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ క్రమంలోనే  2023 సీజన్ లో మళ్లీ చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు అని అన్ని ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నాయి.


 ఇక జట్టులో అనవసరం అన్న ఆటగాళ్లను వదులుకునేందుకు మొహమాట పడటం లేదు ఆయా జట్ల యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఇలా వదులుకోవాల్సి వస్తే ఏకంగా ఆ జట్టు కెప్టెన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పాలి. ఇలా ఐపీఎల్ వేలానికి ముందు కొన్ని జట్లు ఏకంగా కెప్టెన్లను వదులుకుంటూ ఉండటం హాట్ టాపిక్ గా మారి పోయింది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, ఆటగాడిగా విఫలం అయిన మయాంక్ అగర్వాల్ ను జట్టు యాజమాన్యం వదులుకుంటుందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరిగింది.


 ఇక ఇప్పుడు అందరూ అనుకున్నదే నిజం అయింది. మయాంక్ అగర్వాల్ ను వదులు కుంటున్నట్లు ఇటీవల పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. మయాంక్ అగర్వాల్ తో పాటు ఓడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్,  ఇషాన్ పోరేల్, అనిష్ పటేల్,  ప్రేరక్,  సందీప్ శర్మ, రితిక్ లను కూడా వదిలేసుకునేందుకు సిద్ధమైంది. శిఖర్ ధావన్, షారుఖ్ ఖాన్, బెయిర్ స్ట్రో, ప్రభసిమ్రాన్, రాజపక్ష, జితేష్ శర్మ, రాజ్ భవ, ఋషి ధావన్, లివింగ్ స్టోన్, హర్షదీప్ సింగ్, ఎల్లిస్ రబడ రాహుల్ చాహార్ లను కూడా తమతో అంటిపెట్టుకున్నట్లు ఇక పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: