ఇంగ్లాండ్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతంగా రానించిన ఇంగ్లాండ్ ఇక ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. టి20 వరల్డ్ కప్ లో రెండవసారి కప్ గెలుచుకున్న జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇటీవలే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతి తక్కువ విరామంలోనే మళ్లీ ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు సిద్ధమైంది ఇంగ్లాండు జట్టు. అయితే ఆస్ట్రేలియా పర్యటనపై కొంతమంది ఇంగ్లాండు క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇంత తక్కువ విరామంతో మ్యాచులు ఆడటం కష్టమే అంటూ చెబుతున్నారు.


 ఒకవేళ మ్యాచ్లు ఆడినప్పటికీ తమ దగ్గర నుంచి 100% ప్రదర్శన ఆశించడం మాత్రం దారుణం అంటూ మండిపడుతున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై ఇంగ్లాండ్ జట్టు ఆల్రౌండర్ మోయిన్ అలీ సైతం స్పందించాడు. ఇంత తక్కువ విరామంలో మళ్లీ పర్యటన అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇదే విషయంపై అటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం గమనార్హం. భారత టి20 లీగ్ అంటే చాలు మ్యాచ్లు ఆడేందుకు ఉత్సాహంగా బయలుదేరుతూ ఉంటారు.. కానీ అదే ఉత్సాహంతో దేశం కోసం ఆడలేరా అంటూ ప్రశ్నించాడు.


 ఇంగ్లీష్ ఆటగాళ్లు ఇకనైనా ఇలాంటి ఫిర్యాదులకు ముగింపు పలకాలి అంటూ సూచించాడు మైకల్ క్లార్క్. అంతర్జాతీయ షెడ్యూల్ పై ఆటగాళ్లు ఇటువంటి ఫిర్యాదులు చేయడం ఏమాత్రం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. 6 నుంచి 8 వారాలపాటు వీరికి విశ్రాంతి లభిస్తుంది. కానీ డబ్బుల కోసం దేశీయ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు అంగీకరిస్తారు. ఇవన్నీ ఆడుతూ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉండడం ఎలా వీలవుతుంది. ఒకవేళ ఐపిఎల్ తరపున మ్యాచ్ ఆడాల్సి వస్తే మాత్రం ఎలాంటి ఆలోచనలు లేకుండా విమానం ఎక్కేస్తారు. అప్పుడు ఇలాంటి ఫిర్యాదులు చేయాలని ఎవరు అనుకోరు అంటూ మైకల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: