టీమిండియా కెప్టెన్ అనే పదం తెరమీదకి వచ్చిందంటే చాలు ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని  ఎందుకంటే భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని అంత గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. ఎవరికి సాధ్యం కాని రీతిలో వన్డే  వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ఇలా అన్ని రకాల టోర్నీలను టీమిండియా కు సాధించి పెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ఆ తర్వాత ఏ కెప్టెన్ కూడా ఇక ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు అని చెప్పాలి.


 భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోని కేవలం ఒక కెప్టెన్ గా మాత్రమే కాదు ఆటగాడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో కప్ కూడా చేరిపోయింది. అయితే అది క్రికెట్లో కాదు మరో ఆటలో. మహేంద్రసింగ్ ధోని క్రికెట్ మాత్రమే కాదు అటు టెన్నిస్ కూడా బాగా ఆడుతూ ఉంటాడు. ఈ మేరకు జార్ఖండ్లో ప్రతి ఏడాది జరిగే టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొంటూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ఏడాది జేఎన్సిఏ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ విభాగంలో స్థానిక టెన్నిస్ ప్లేయర్ సుమిత్ కుమార్ బజాజ్ తో జత కట్టిన ధోని ఏకంగా కప్పు గెలుచుకున్నాడు అని చెప్పాలి.


 అయితే ఈ టోర్నీలో మహేంద్రసింగ్ ధోని ఇలా కప్పు గెలవడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఇక ధోని ఇలా ఇటీవల జరిగిన టెన్నిస్ పోటీల్లో ఏకంగా ట్రోఫీ అందుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో భారత అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. భారత జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో ట్రోఫీ చేరిపోయింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే మరోవైపు ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని ఏకంగా ఆ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించి.. ఇక జట్టును మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా నిలిపాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: