నిన్న సాయంత్రం 5 గంటలతో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పాలక మండలి తమ దగ్గర ఉన్న ఆటగాళ్లకు సంబంధించి అంటి పెట్టుకోవడం లేదా వదిలివేయడం అన్న ప్రక్రియకు సమయం ముగిసింది. ప్రస్తుతం అన్ని జట్లు తమ దగ్గర ఉన్న ఆటగాళ్లతో సంతృప్తిగా ఉన్నారు. ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంచైజీలు ఈ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాల పట్ల మాజీ క్రికెటర్లు మరియు అభిమానులు పలు విమర్శలు చేస్తున్నారు. కొందరి ఆటగాళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు సరైనప్పటికీ, మరికొందరి విషయంలో తొందరపడ్డారా అన్న సందేహం వీరిలో కలుగుతోంది. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో కేరళలోని కొచ్చిన్ వేదికగా ఐపీఎల్ 2023 కు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నారు. దీనిని ఇప్పడు అందరూ మినీ వేలంగా పిలుచుకుంటున్నారు. ఎక్కువ ఫ్రాంచైజీలకు విదేశీ ఆటగాళ్ల స్లాట్స్ ఖాలీగా ఉన్నాయి.

ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీలు చేసిన పొరపాటు ఏమిటంటే... విదేశీ ప్లేయర్ మీద ఎన్నని కోట్లు అయినా పెట్టడానికి సిద్ధం అవడం. తీరా అన్ని కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంటే ప్రదర్శన సంతృప్తికరంగా ఉండదు. ఇప్పటి వరకు ఇలాంటి ఉదాహరణలు చాలానే చూశాము. ఒక విదేశీ ప్లేయర్ అవుట్ సైడ్ ఆసియా లో ఏదైనా లీగ్ లో బ్రహ్మాండంగా ఆడడమే తడువు వెంటనే ఐపీఎల్ కోచ్ లు వారిని తమ తమ టీం లోకి లాగేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదాహరణకు: బిగ్ బాస్ లీగ్ గురించి అందరికీ తెలిసిందే... ఈ లీగ్ లో ఒక్క ఇండియా మినహాయించి అన్ని దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. ఆస్ట్రేలియా లో పిచ్ లు బ్యాటింగ్ కు బాగా అనుకూలించవచ్చు లేదా అక్కడ పిచ్ లు వారికి బాగా అలవాటు ఉండడం వలన పరుగుల వరద పారిస్తుంటారు .

అయితే అక్కడ ఆడడం చూసిన మన ఐపీఎల్ కోచ్ లో వారి కోసం కోట్లకు కోట్లు వెచ్చిస్తుంటారు. అయితే ఈసారి జరగనున్న మినీ వేలంలో మన ఇండియాలో బాగా ఆడే ఆటగాళ్ల కోసం మాత్రమే కోట్లు వెచ్చించండి. లేకపోతే... అదే మొత్తానికి విలువైన ఇద్దరు ఇండియా కుర్రాళ్ళను కొనుగోలు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: