ఇండియా క్రికెట్ టీం గత 11 సంవత్సరాలుగా ఐసీసీ టైటిల్ సాధించలేదు. ద్వైపాక్షిక సిరీస్ లు , ఆసియా కప్ లు సాధించినా అవి పెద్దగా లెక్కలోకి రావు. ఎందుకంటే ఏదైనా ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిస్తే అపుడు కిక్ ఉంటుంది. గతంలో ధోని ఇండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో 2007 లో టీ 20 వరల్డ్ కప్ టైటిల్ మరియు 2011 లో వన్ డే వరల్డ్ కప్ టైటిల్ ను అందించాడు. ఇక అప్పటి నుండి కెప్టెన్ లు మారినా కోచ్ లు మారినా టీం ఇండియా రాత మాత్రం మారడం లేదు. ఇటీవల ముగిసిన టీ 20 వరల్డ్ కప్ ను అయినా సాధిస్తారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇండియా ఫ్యాన్స్ కు మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది.

లీగ్ స్థాయిలో అద్భుతంగా ఆడిన ఇండియా సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యి ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పలువురు మాజీ క్రికెటర్స్ , క్రికెట్ విశ్లేషకులు అయితే ఓటమికి కారణం అయిన అతగాడిని విమర్శించారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కు అయితే ఈ ఓటమిలో సగభాగం ఉంది... కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఒక బ్యాట్స్మన్ గా కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీనితో కెప్టెన్ ను మార్చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ లు వినిపిస్తున్నాయి .

కాగా తాజాగా రోహిత్ శర్మను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ కీలక వ్యాఖలు చేశాడు. సల్మాన్ భట్  తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ రోహిత్ శర్మ చాలా మంచి ప్లేయర్ అంటూ పొగుడుతూనే ఫిట్ గా లేడని కామెంట్ చేశాడు.. అంతే కాకుండా తాను ఫాట్ గా లేకపోవడం వలన ఫీల్డింగ్ లో చాలా లేజీ గా కనిపిస్తున్నడంతో చురకలంటించాడు. కొంతకాలం రోహిత్ తన ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోవడం పైన దృష్టి పెడితే ఇండియాకు చాలా ప్లస్ అవుతుంది అన్నాడు. ప్రస్తుతం సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపైనా  ఇండియా మాజీలు కానీ కరెంట్ ప్లేయర్స్ కానీ ఏమైనా స్పందిస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: