ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో భాగంగా మొదటి సెమీఫైనల్ లో న్యూజిలాండ్, రెండవ సెమీఫైనల్ లో టీమిండియా జట్లు ఓడిపోయి ఇంటి దారి పట్టి ఇక అభిమానులు అందరిని కూడా నిరాశ పరిచాయి  అని చెప్పాలి. వరల్డ్ కప్ ముగిసిన నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా వరుస పర్యటనలతో బిజీబిజీగా గడిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. అక్కడ టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది.. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో టి20 సిరీస్ కు తాత్కాలిక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించారు.


 అదే సమయంలో న్యూజిలాండ్తో తలబడబోయే వన్డే సిరీస్ కి కెప్టెన్గా శిఖర్ ధావన్ ను నియమించడం గమనార్హం. కాగా రేపటి నుంచి ఇక భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టి20 సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి.. వెల్డింగ్టన్ వేదికగా రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఇకపోతే ఇటీవలే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టీ20, వన్డే సిరీస్ లకు సంబంధించిన జట్లను ఎంపిక చేసి పూర్తి వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏకంగా సొంత గడ్డపై జరుగుతున్న వరుస సిరీస్ లకు అటు న్యూజిలాండ్ జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఇద్దరు దూరమయ్యారు అన్నది తెలుస్తుంది.


 ఇద్దరు స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ స్టార్ ప్లేయర్లు ఎవరో కాదు న్యూజిలాండ్ ఆల్రౌండర్ మార్టిన్ గాప్తిల్, స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ కావడం గమనార్హం. మార్టిన్ గప్తిల్ స్థానాన్ని ఫిన్ అలెన్ తో భర్తీ  చేయబోతున్నారు. అంతేకాకుండా ట్రెంట్ బౌల్ట్  స్థానాన్ని ఎన్నో రోజులుగా జట్టుకు దూరమైన ఫేసర్ ఆడమ్ మిల్నేతో భర్తీ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.. అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో నిరాశ పరిచిన టీమ్ ఇండియా ఇక ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో మాత్రం మరోసారి సత్తా చాటాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: