మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు దినేష్ కార్తీక్ ను కాదని యువ ఆటగాడు రిషబ్ పంత్ కు జట్టులో చోటు కల్పించారు సెలెక్టరు. కానీ అతను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరాడు. దీంతో  అతని ప్రదర్శన పై ఎంతో మంది విమర్శలు చేశారు.  ఇకపోతే ఇటీవల సెమీఫైనల్ లో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైంది. ఇక టి20 సిరీస్ లో భాగంగా రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సి చేపట్టబోతున్నాడు. అయితే ఇక వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్కు బాధ్యతలు అప్పగించారు.


 అయితే ఇక న్యూజిలాండ్ టూర్ లో భాగంగా గత కొంతకాలం నుంచి జట్టులో స్థానం కోల్పోయిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్,  సంజు శాంసన్ కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో అందరికన్నా కూడా రిషబ్ పంత్ తో పాటు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ పైనే ఉంది. ఇక ఈ టూర్ లో రాణించిన వారే తర్వాత కాలంలో టీమిండియాలో సుస్థిర వికెట్ కీపర్ గా ఉండే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు రిషబ్ పంత్ 64 టీ20 మ్యాచ్ లలో 920 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతనికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా మాత్రం మంచి గణాంకాలు ఉన్నాయి.


 కిషన్ కిషన్ ఇప్పుడు వరకు 16 టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడగా 543 పరుగులు చేశాడు.. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండడం గమనార్హం. ఇక సంజు  కూడా 16 టి20 మ్యాచ్లలో 296 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా మాత్రం అతనికి మంచి రికార్డు ఉంది. అయితే ధోని తర్వాత అతని వారసుడిగా పేరును నిలబెట్టే ప్లేయర్ గా మాత్రం సంజు  ఒక్కడే కనిపిస్తున్నాడు. ధోనిలా ఎప్పుడు కూల్ గా ఉండే సంజు స్టాంప్స్ ఇక ఫినిషర్గా జట్టుకు అక్కరకు వస్తాడు అని విశ్లేషకుల మాట. ఒకవేళ న్యూజిలాండ్ టూర్లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లు బాగా రాణిస్తే మాత్రం ఇక పంత్ కు టీమిండియాలో స్థానానికి చెక్ పెట్టినట్లే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: