గత కొంతకాలం నుంచి భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ బ్యాటింగ్ విధ్వంసం ప్రపంచ క్రికెట్లో అందరిని మంత్రముగ్ధులని చేస్తుంది అన్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఏదైనా తనకు బౌలింగ్ చేసే బౌలర్ ఎవరైనా సరే ఇక తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఎక్కడ సూర్య కుమార్ యాదవ్ లో మాత్రం ఒత్తిడి కనిపించడం లేదు అని చెప్పాలి. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు చేయడానికి ఎంతో కష్టపడి పోతున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఎంతో అలవోకగా మైదానం నలువైపులా భారీ బౌండరీలు బాదుతూ ఇక పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా గుర్తింపు సంపాదించుకున్న సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల టీ20 బ్యాట్స్మెన్ ల ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.


 దీంతో సూర్య కుమార్ యాదవ్ అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇక ఇప్పుడు మరోసారి సూర్య కుమార్ యాదవ్ తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం గానే ఉంచుకున్నాడు అని చెప్పాలి. సూర్య కుమార్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు అని చెప్పాలి. ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 12 దశలో   మూడు హాఫ్ సెంచరీలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు సూర్య కుమార్ యాదవ్.  ఐసీసీ విడుదల చేసిన టి20 బ్యాట్స్మెన్ల ర్యాంకింగ్స్లో 869 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఎగ్జామ్ ఒక స్థానం ఏకబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక మహమ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి.


 అదే సమయంలో సౌతాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్కరమ్ ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా.. దక్షిణాఫ్రికాకు చెందిన రూసో ఏడవ నెంబర్ కు చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఒక స్థానం దిగజారి 8వ స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ 5 స్థానాలు ఎగబాకీ మూడవ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పై, ఇక ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు అదిల్ రషీద్. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సామ్ కరణ్ కూడా రెండు స్థానాలు ఏక బాకీ 5వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: