ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది టీమిండియా జట్టు. కనీసం ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు  పోటీ ఇవ్వలేక బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా చేతులెత్తేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమిపై అటు మాజీ ఆటగాళ్లు సైతం కాస్త ఘాటు గానే స్పందించారు. ఇలాంటి సమయంలోనే అటు టీమిండియా పై గెలిచి ఫైనల్ కు వెళ్లిన ఇంగ్లాండు జట్టు ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి ఇక టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. టి20 ఫార్మాట్లో రెండు ఓసారి వరల్డ్ కప్ అందుకున్న రెండవ జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది.


 ఇక ఇలాంటి సమయంలోనే ఎప్పుడు టీమిండియా ప్రదర్శన పై తన అక్కస్సును వెళ్లగకే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇటీవల సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం గురించి మాట్లాడుతూ ఏకంగా భారత జట్టును అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఎప్పటికీ వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ కాలేదని.. ఇక ఇంగ్లాండ్ జట్టు మాత్రమే టైటిల్ ఫేవరెట్ గా ఉంటుందని మైకల్ వాన్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇక వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ ను అటు బీసీసీఐ అహంకారం తగ్గించుకొని ఫాలో అవుతే బాగుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 అయితే మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారగా. అతని కామెంట్స్ పై భారత మాజీ ఆటగాళ్లు సైతం కౌంటర్లు ఇచ్చారు. ఇక ఇటీవల ఇదే విషయంపై ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా సైతం స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తామని.. అయితే భారత జట్టు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. మేము ప్రొఫెషనల్ ఆటగాళ్ళం.. జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళుతూ ఉంటాం అంటూ హార్దిక్ పాండ్యా కౌంటర్ ఇచ్చాడు.  చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మెరుగవుతూ ఉంటాం అంటూ హార్దిక్ వ్యాఖ్యానించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: