బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా టైటిల్ గెలవాలని బరిలోకి దిగుతున్న కొన్ని జట్లకు ప్రతి సీజన్లో కూడా నిరాశ ఎదురవుతుంది అని చెప్పాలి. ఏకంగా జట్టు కెప్టెన్లను, మార్చిన జట్టులో ఉన్న ఆటగాళ్లను మార్చిన కూడా ఆయా జట్లకు ఎందుకో అదృష్టం మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగరేసుకుపోతే ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్ లో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కొన్ని జట్లకు మాత్రం ఐపీఎల్ టైటిల్ గెలవడం అందని ద్రాక్ష లాగానే కొనసాగుతూ ఉంది.


ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో టైటిల్ పోరులో నిరాశ పడిన ఎన్నో జట్లు ఇక ఇప్పుడు జట్టులో అనూహ్యమైన మార్పులను తెర లేపుతూ ఉన్నాయి అని చెప్పాలి. జట్టులో ఉన్న ఆటగాళ్లను మాత్రమే కాదు అవసరమైతే ఏకంగా సారధులను సైతం వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో ఇక కోచింగ్ సిబ్బందిలో కూడా ఎన్నో మార్పులు తీసుకువస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఆయా జట్ల నిర్ణయాలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.



 అయితే పంజాబ్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఏకంగా కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను కూడా వదులుకొని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు కొత్త కోచింగ్ స్టాప్ నియామకం కూడా చేపట్టింది అన్నది తెలుస్తుంది. టీమిండియా మాజీ క్రికెటర్ వసిం జాఫర్ ను బ్యాటింగ్ కోచ్గా సౌత్ ఆఫ్రికా మాజీ ఫేసర్ చార్ల్ లాంగ్ వెల్డ్ బౌలింగ్ కోచ్ గా నియమించినట్లు ఇటీవలే పంజాబ్ కింగ్స్ తెలిపింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్  అసిస్టెంట్ కోచ్గా నియమితుడయ్యాడు.. కాగా ఇప్పటికే ట్రేవోర్ బేలెస్ ను ఇక పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా నియమించుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: