గత కొంతకాలం నుంచి సూర్య కుమార్ యాదవ్ పేరు సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపించింది అంటే చాలు ఇక ఏం వార్త వచ్చిందా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల సూర్య కుమార్ యాదవ్ ఏకంగా తన భార్య పుట్టినరోజు నాడు తన మనసులో దాగి ఉన్న ప్రేమను  బయటపెట్టి ఒక పోస్ట్ పెట్టగా అది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక సూర్య కుమార్ యాదవ్ తన భార్య పుట్టిన రోజున అంటూ ఎలాంటి పోస్ట్ పెట్టాడు అన్న విషయాన్ని తెలుసుకునే ముందు ఇక వారి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. ముంబై కాలేజీలో చదువుతున్న సమయంలోనే 2012లో తొలిసారి దేవిశాను కలిశాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఆమె డాన్సులు చూసి ఒక్కసారిగా ఫిదా అయిపోయాడట. అప్పుడు దేవిశ వయసు 17 ఏళ్లు అయితే సూర్యకుమార్ వయస్సు 20 ఏళ్లు మాత్రమే.  కాగా వీరి మధ్య పరిచయం  స్నేహంగా మారింది. వీరి స్నేహంలో ప్రేమ చిగురించింది. ఇక 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు ఈ జంట. ఇక తర్వాత పెద్దలను ఒప్పించి 2016లో వివాహం చేసుకున్నారు.


 తను కెరియర్ లో నిలదొక్కుకోవడానికి తన భార్య దేవిశ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటూ ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు సూర్య కుమార్ యాదవ్. ఏకంగా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇక దేవిశా పేరును తన గుండెల పై పచ్చబొట్టు కూడా వేసుకున్నాడట. ఇక భార్యపై ఇంత ప్రేమ చూపించే సూర్య కుమార్ ఇక పుట్టినరోజు నాడు ఎలాంటి పోస్ట్ పెట్టాడంటే. నా అందమైన భార్యకు బర్త్ డే శుభాకాంక్షలు.. నా ప్రపంచం సమస్యల నుంచి గట్టెక్కించినా ప్రియనేస్తం నాలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగేలా కెరియర్ పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించే వ్యక్తి.. ఒకవేళ నువ్వు నా జీవితంలో లేకుంటే నేను ఏమైపోయేవాడినొ.. నా జీవితంలో నాకు దక్కిన విలువైన బహుమతి.. నువ్వే అంటూ మనసులో ఉన్న ప్రేమను మొత్తం పోస్టులోనే చూపించాడు సూర్య కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: