ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చి సెమీఫైనల్ లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత సెమి ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. దీంతో 1992 సెంటిమెంట్ అవుతుందని ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలుస్తుందని అందరూ బలంగా నమ్మారూ. కానీ ఊహించని రీతిలో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే ఇలా ఫైనల్ లో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని అటు ఆ జట్టు అభిమానులు మాత్రం అస్సలుజీర్ణించు కోలేకపోతున్నారు. అభిమానులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం ఇక ఇలా ఫైనల్ లో పాకిస్తాన్ ఓటమిపై కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.


 ఫైనల్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో ఏకంగా కెప్టెన్ బాబర్ అజాంను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అతని పని అయిపోయిందని వెంటనే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే అటు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరినప్పటికీ ఇందులో అటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం పాత్ర మాత్రం ఏమీ లేకపోవడం గమనార్హం. ఎందుకంటే బ్యాట్స్మెన్ గా పూర్తిగా విఫలం అయ్యాడు అతను.  ఇక ఈ విషయంపై కూడా విమర్శలు చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  ప్రస్తుతం టి20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేసి కేవలం వన్డేలు టెస్టులకు మాత్రమే అతను కెప్టెన్సీని కొనసాగిస్తే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చాడు షాహిద్ ఆఫ్రిది. పాకిస్తాన్ కు మాత్రమే కాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా షెఫవర్ కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ చేపట్టకూడదు అంటూ సూచించాడు. కేవలం అతను బ్యాటింగ్ పై దృష్టి సారిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.   షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: