ఇటీవలే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే మళ్ళీ ఎప్పటిలాగానే టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ లో పర్యటించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇక ఈ పర్యటన ముగిసిన వెంటనే మరో నాలుగు జట్లతో సిరీస్ లను కూడా ఆడబోతుంది టీమిండియా. ఇకపోతే ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా నేటి నుంచి అటు న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్ ఆరంభం ఆడెందుకు సిద్ధమైంది  అన్న విషయం తెలిసిందే. తొలి టి20 మ్యాచ్ వెల్డింగ్టన్  వేదికగా జరగబోతుంది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు ఇక తాత్కాలిక సారధిగా వ్యవహరించబోతున్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా మొన్నటి వరకు భారత జట్టుకు దూరమైన ఎంతో మంది యువ ఆటగాళ్లు అటు జట్టులో స్థానం సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ వైఫల్యం నేపథ్యంలో జట్టులో యువ ఆటగాళ్లను చేర్చాలని భావిస్తున్న బీసీసీఐ ఇలా న్యూజిలాండ్ పర్యటనలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇందులో బాగా రాణించిన ఆటగాళ్లకు తర్వాత కాలంలో ఇక భారత తుది జట్టులో స్థానం సుస్థిరం అయ్యే అవకాశం ఉంది.


 ఇదిలా ఉంటే.. ఇప్పటికే తన కెప్టెన్సీ సత్తా ఏంటో చూపించిన హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం బౌలింగ్లో బ్యాటింగ్ లో కూడా భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో తన కెప్టెన్సీ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు ఇక ఇప్పుడు మాత్రం మళ్లీ సొంత గడ్డపై తమ ఆదిపత్యాన్ని కొనసాగించి టీమిండియా పై విజయం సాధించాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే పోరు ఎంతో ఆసక్తికరంగా మారబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: