ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీన ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ మొన్నటికి మొన్న నవంబర్ 13వ తేదీన మేల్ బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అయితే వరల్డ్ కప్ అయితే ముగిసింది కానీ ఇక వరల్డ్ కప్ లో ఆయా జట్లు చేసిన ప్రదర్శన గురించిన రివ్యూలు ఇక కొంతమంది మాజీ ఆటగాళ్ల విమర్శలు మాత్రం ఇంకా ముగియడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఫైనల్లో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీ ఆటగాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై తరచూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇక ప్రపంచ క్రికెట్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ఆ మ్యాచ్ పై రివ్యూలు ఇచ్చే పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానీష్ కనేరియా ఇక ఇటీవలే మరోసారి ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం గురించి స్పందించాడు. అంతేకాకుండా కెప్టెన్ బాబర్  బ్యాటింగ్ గురించి కూడా స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.  బాబర్ అజాం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో 53పరుగులు మినహా ఏ మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

 ఇక దీనిపై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు  కనేరియా బాబర్ అజాం ఒక మొండిగటం.. కరాచీ జట్టుకు ఆడుతున్న సమయంలో కూడా ఇదే జరిగింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయకుండా ఓపెనర్ గా ఆడేందుకే మొండి పట్టుదల చూపించాడు. ఇక ఇలాంటి వైఖరి వల్ల జట్టుకు నష్టం వాటిల్లుతుంది. ఒకవేళ రిజ్వాన్ రానిస్తే బాబర్ కూడా బాగా బ్యాటింగ్ చేస్తాడు. తన ఇన్నింగ్స్ ని సైతం నెమ్మదిగా ఆరంభిస్తాడు అంటూ  కనేరియా చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో విరాట్ పై ప్రశంసలు కురిపించాడు. నిస్వార్ధంగా ఆడే ఆటగాళ్లలో టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని మించిన వారు లేరు. అతడు కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదురైనా.. ఇప్పటికీ నిస్వార్ధంగా జట్టు కోసం తన పూర్తిస్థాయి ప్రదర్శన చేస్తూనే ఉంటాడు.  ఏ నెంబర్ లో ఆడేందుకైనా సిద్ధంగా ఉంటాడు అంటూ  కనేరియా ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: