ఇటీవలే వరల్డ్ కప్ ముగిసిన నేపథ్యంలో టీమిండియా జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కడ కివీస్ జట్టుతో టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ఆడేందుకు సిద్ధమవుతుంది. అయితే ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్ళతో కూడిన టీమిండియా జట్టు ప్రస్తుతం అటు న్యూజిలాండ్తో టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే వెల్లింగ్టన్ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరగాల్సి ఉంది.


 కానీ ఊహించని రీతిలో వరుణుడు కరుణించకపోవడంతో ఇక మొదటి మ్యాచ్ కాస్త రద్దయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మ్యాచ్ రద్దు అయిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లేని జట్టును ద్వితీయశ్రేణి జట్టుగా భావించాలా అంటూ విలేకరులు ప్రశ్నించగా ఆసక్తికర సమాచారం చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,  కేఎల్ రాహుల్ లేకపోయినప్పటికీ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలిగే సత్తా టీమిండియా కు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.


 టీమిండియా కేవలం కొంతమంది మీద ఆధారపడి లేదని.. ఆ జట్టులో ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు అంటూ పేర్కొన్నాడు. ఇక టీమిండియా యువ క్రికెటర్లు భారతదేశానికి పెద్ద ఆటగాళ్లు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను వారందరినీ భారత టీ20 లీగ్ లో చూశాను. ఈ ఆటగాళ్లు మంచి ప్రతిభవంతులు అంటూ కేన్ విలియమ్సన్  చెప్పుకొచ్చాడు. అంతే కాదు 2023 ప్రపంచ కప్ సన్నద్ధత కోసం ఇక ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లు ఒక మంచి అవకాశం అంటూ తెలిపాడు కేన్ విలియంసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: