టీమిండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకొని తన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు యువ ఆటగాడు శుభమన్ గిల్. అయితే తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ వచ్చిన అవకాశాలను మాత్రం ఎంతో బాగా సద్వినియోగం చేసుకుంటూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి భారత జట్టు తరఫున టెస్టులలో రెగ్యులర్ గా ఆడుతూ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక అప్పుడప్పుడు వన్డే ఫార్మాట్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే ఇలా టీమిండియా టెస్ట్, వన్ డే ఫార్మట్ లోకి వచ్చి ఎన్నో రోజులు గడుస్తున్న ఇప్పటివరకు శుభమన్ గిల్ టి20 ఫార్మాట్లో మాత్రం చోటు దక్కించుకోలేదు అని చెప్పాలి. ఇక మొదటిసారి అటు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా అతను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న టి20 అరంగేట్రానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్లో పొట్టి ఫార్మాట్లో తన డేబ్యు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఉన్నారు.


 ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ సైతం స్పందించాడు. గత ఆరు నెలలుగా శుభమన్ గిల్ క్లాస్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ తరపున జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా 50, 60 సగటుతో రన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అంటూ తెలిపాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా అందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు అతను వన్డేలలో మాత్రమే ఆడాడని ఇక మొదటిసారి సెలెక్టలర్లు అతనికి టి20 లలో అవకాశం ఇచ్చారు అంటూ తెలిపాడు మహమ్మద్ కైఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: