2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం సన్నదమయ్యే క్రమంలో బీసీసీఐ ఇక అన్ని వ్యవహారాలను కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకువెళ్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది బీసీసీఐ. ఇక డిసెంబర్ 23వ తేదీన మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మినీ వేలంలో భాగంగా తమ దగ్గర ఉన్న పర్స్ మనితో రేసుగుర్రాళ్లాంటి క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు ఇప్పటినుంచి ప్రణాళికలను రచిస్తూ ఉన్నాయి ఆయా జట్ల ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐపీఎల్ శాలరీల కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసిన  ఫ్రాంచైజీ ఏది అన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఎక్కువ మొత్తం ఖర్చు చేసిన ఫ్రాంచైజీ ఏది అంటే అందరూ ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ అని అనుకుంటారు. కానీ అలా అనుకున్నారంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్కసారి టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎక్కువ శాలరీలు చెల్లించిందట. ఏకంగా ఇప్పటివరకు బెంగళూరు జట్టు అక్షరాల 910 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ఎక్కువ ఖర్చు చేసిన టీమ్ గా కొనసాగుతుంది.

 ఏ జట్టు ఎంత ఖర్చు చేసింది అనే వివరాలు చూసుకుంటే  :

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 910.5 కోట్ల రూపాయలు.
ముంబై ఇండియన్స్‌- 884.5 కోట్ల రూపాయలు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 852.5 కోట్ల రూపాయలు.
ఢిల్లీ క్యాపిటల్స్‌- 826.6 కోట్ల రూపాయలు.
పంజాబ్‌ కింగ్స్‌- 778.3 కోట్ల రూపాయలు.
చెన్నై సూపర్‌ కింగ్స్‌- 761.1 కోట్ల రూపాయలు.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 646.9 కోట్ల రూపాయలు.
రాజస్తాన్‌ రాయల్స్‌- 613.3 కోట్ల రూపాయలు.

2022లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లు :
లక్నో సూపర్‌ జెయింట్స్‌- 89.2 కోట్ల రూపాయలు.
గుజరాత్‌ టైటాన్స్‌- 88.3 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు ఖర్చు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb