టి20 వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటంలో ఉంది. ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ తో పాటు వన్ డే సిరీస్ కూడా ఆడబోతుంది టీమిండియా అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమిండియా కు రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ లో ఎవరు భారత జట్టుకు ఓపనర్లుగా రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల వెల్డింగ్టన్ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి ఉండి ఉంటే మాత్రం ఇక భారత ఓపెనింగ్ జోడీగా ఎవరు రాబోతున్నారు అన్నదానిపై స్పష్టత వచ్చేది.



 కానీ మ్యాచ్ రద్దు కావడంతో ఇక భారత ఓపెనింగ్ జోడి ఎవరు అన్న విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సైతం ఇక ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తి పరుస్తూ ఉన్నారు. అయితే కేవలం మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు జట్టులో సీనియర్ ప్లేయర్లుగా ఉన్నవారు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. అయితే ఇటీవల ఏకంగా దినేష్ కార్తీక్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ పంత్ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 పవర్ ప్లే లో ఉండే ఫీల్డింగ్ నిబంధనలు ఉపయోగించుకొని మంచి షాట్లు ఆడగల సత్తా రిషబ్ పంత్ కు ఉంది అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అయితే అతడికి ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వారిపై ఒత్తిడి పెంచేందుకు రిషబ్ పంత్ ఎక్కువగా ఇష్టపడతాడు అని చెప్పుకొచ్చాడు. అయితే రిషబ్ పంత్ వైపు కొన్ని వైఫల్యాలు ఉన్న వాటా వాస్తవమే అంటూ తెలిపాడు. కానీ రిషబ్ పంత్ ఒక అద్భుతమైన ఆటగాడు అంటూ ప్రశంసలు కురిపించాడు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి: