ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం మేటిజట్టుగా కొనసాగుతోంది ఆస్ట్రేలియా. అయితే మొన్నటికి మొన్న ఏకంగా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ జరిగిన నేపద్యంలో ఇక వరుసగా రెండవసారి ఆస్ట్రేలియా జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో అటు ఆస్ట్రేలియా పేలవ ప్రదర్శన చేసి చివరికి సెమీఫైనల్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఏకంగా సొంత గడ్డపై మ్యాచ్లు జరిగినప్పటికీ కూడా అటు ఆస్ట్రేలియా గెలకపోవడంపై ఎంతో మంది తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు.


 అయితే ఇక ఇలా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా అటు విశ్వవిజేతగా ఇంగ్లాండ్ జట్టు నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఫైనల్ లో పాకిస్తాన్ గురించి టి20 వరల్డ్ కప్ ను మరోసారి కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అదే ఆస్ట్రేలియా గడ్డపై అదే పిచ్ లపై మరోసారి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు వరల్డ్ కప్ లో మాత్రం అదరగొట్టింది. ఇప్పటికే మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండో వన్డేలో కూడా ఘన విజయాన్ని అందుకుంది.


 ఇటీవల జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 72 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. దీంతో 3 వన్డేల సిరీస్ లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చూసిన ఆస్ట్రేలియా 279 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 38.5 ఓవర్లలోనే 28 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇకపోతే  స్టార్క్ తో పాటు ఆడమ్ జంపా చెరో నాలుగు వికెట్లు తీయడం గమనార్హం.  ఇక నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ ఈనెల 22వ తేదీన మేల్ బోర్న్ వేదికగా జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: