ఇటీవల కాలంలో ఎంతోమంది తెలుగు క్రికెటర్లు అటు క్రికెట్లో బాగా రాణిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక వివిధ దశల్లో మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.. ఇలా తెలుగు క్రికెటర్లు ఎవరైనా మంచి ప్రదర్శన చేశారు అంటే చాలు ఇక వారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇటీవల మరో తెలుగు క్రికెటర్ భారత జట్టులో స్థానం  సంపాదించుకుంది అన్న వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఏకంగా భద్రాచలం అమ్మాయి అయినా గొంగడి త్రిష భారత అండర్ 19 మహిళల క్రికెట్ లో ఇటీవల చోటు సంపాదించుకుంది అని చెప్పాలి. న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం ఇటీవల అండర్ 19 భారత జట్టును ఎంపిక చేయగా ఇక ఇందులో అటు భద్రాచలం కు చెందిన గొంగడి త్రిష ఎంపిక కావడం గమనార్హం. అయితే 8 ఏళ్ల వయసులోనే త్రిష అండర్ 16 జట్టులో తన టాలెంట్ ఏంటో చూపించి ఇక అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి. దీంతో ఎంతోమంది తనకంటే సీనియర్ ప్లేయర్ల చేత ప్రశంసలు అందుకుంది.


 12 ఏళ్ల వయసులోనే రాష్ట్ర అండర్ 19 జట్టు తరఫున కూడా ప్రాతినిధ్యం వహించి తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది గొంగడి త్రిష. ఇలా తన వయస్సుతో సంబంధం లేకుండా ఏకంగా వరుసగా అటు భారత జట్టులో చోటు సంపాదించుకుంటూ సత్తా చాటుతూ వచ్చింది అని చెప్పాలి. అంతేకాకుండా చిన్న వయసులోనే బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా దక్కించుకుంది ఈ మహిళా క్రికెటర్. లెగ్ స్పిన్ బౌలింగ్ తో పాటు ఇక బ్యాటింగ్ లో కూడా సత్తా చాటుతుంది అని చెప్పాలి. టీమిండియా మహిళల జట్టుకు ఎంపిక అయి రాణించడమే తన లక్ష్యం అంటూ చెబుతుంది గొంగడి త్రిష. ఈ క్రమంలోనే ఎంతోమంది తెలుగు క్రికెట్ ప్రేక్షకులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: