ఇటీవల టి20 ప్రపంచ కప్ లో భాగంగా అటు టీమ్ ఇండియా జట్టు సెమి ఫైనల్లో ఘోర ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఇక ఈ ప్రభావం అటు టీం ఇండియా పై స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అటు బీసీసీఐ పెద్దలు అందరూ కూడా అనూహ్యమైన   నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి జట్ల మాదిరిగానే జట్టులో ఆల్రౌండర్ల సంఖ్యను పెంచాలి అని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు వరుసగా చాన్సులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బీసీసీఐ పెద్దలు.

 ఇక వరల్డ్ కప్ లో వైఫల్యం తర్వాత టీమ్ ఇండియా జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో భారత జట్టులో ఆల్రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది టీమిండియా యాజమాన్యం. ఇకపోతే ఇటీవల హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా జట్టు రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ పై ఏకంగా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటివరకు కివీస్ గడ్డపై న్యూజిలాండ్ పై ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం.


 గెలుపు అనంతరం మాట్లాడిన హార్థిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. రెండవ టి20 మ్యాచ్ లో విజయం సాధించడం పై హర్షం వ్యక్తం చేసాడు. ఇక ఈ మ్యాచ్ లో బౌలర్లు అద్భుతంగా రాణించారు అంటూ ప్రశంసల కురిపించాడు. అయితే తనకు మరిన్ని బౌలింగ్ ఆప్షన్లు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇందుకోసం రానున్న రోజుల్లో బ్యాట్స్మెన్లు కూడా భవిష్యత్తులో బౌలింగ్లో సత్తా చాటాలని కోరుకుంటున్నాను తెలిపాడు. ఇలా ఒకరకంగా జట్టులో ఆల్ రౌండర్లు ఉండటం వల్ల జట్టు మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డాడు పాండ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: