ఇటీవలే న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్య న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.. మైదానంలోకి రావడం రావడమే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయిన సూర్య కుమార్ యాదవ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు అని చెప్పాలి. ఏకంగా వీడియో గేమ్ లో చూసినట్లుగానే మైదానం నలువైపులా ఎంతో అలవోకుగా షాట్లు కొట్టిన సూర్య కుమార్ యాదవ్ పరుగుల వరద పారించాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి జట్టుకు ఒక భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర వహించాడు.


 ఇక సూర్య కుమార్ యాదవ్ తన మొత్తం ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు సిక్సర్లు కొడితే అటు భారత జట్టులో ఉన్న మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కలిపి కొట్టింది మాత్రం రెండు సిక్సర్లు మాత్రమే కావడం గమనార్హం. దీనిబట్టి సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సెంచరీ తో చెలరేగిపోయిన సూర్య కుమార్ యాదవ్ పై ప్రస్తుతం ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏకంగా ప్రత్యర్థి న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం అతని ఇన్నింగ్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి.


 ఇటీవల రెండో టి20 మ్యాచ్లో సెంచరీ తో చెలరేగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ పై ప్రత్యర్థి న్యూజిలాండ్ బౌలర్ టీమ్ సౌదీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఏడాదిగా సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొట్టగలడు ఇక అంతర్జాతీయ క్రికెట్లో దూసుకుపోతున్నాడు. అయితే భారత క్రికెట్ లో సూర్యకుమార్ ఒక్కడే అత్యుత్తమ ఆటగాడు కాదు. ఎంతోమంది మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. కేవలం టి20 లలో మాత్రమే కాకుండా అన్ని ఫార్మట్లలో రాణించేవారు ఉన్నారు అంటూ టీమ్ సౌదీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: