వెస్ట్ ఇండీస్ వైట్ బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకుని తన అభిమానులకు మరియు తోటి జట్టు సభ్యులకు షాక్ ఇచ్చాడు. ఈ సంవత్సరం మే నెలలో పోలార్డ్ అంతర్జాతీయ కెరీర్ నుండి రిటైర్డ్ కాగా , అతని స్థానంలో కెప్టెన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు వైట్ బాల్ క్రికెట్ కు నూతన కెప్టెన్ గా నియమించింది. పూరన్ కెప్టెన్సీలో వెస్ట్ ఇండీస్ ఇప్పటి వరకు మొత్తం 15 వన్ డే మ్యాచ్ లు ఆడగా, వాటిలో కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి మిగిలిన మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అదే విధంగా 15 టీ 20 లు ఆడగా నాలుగింటిలోనే విజయం సాధించింది.

తన కెప్టెన్సీ ప్రభావం ఏ మాత్రం మ్యాచ్ లలో చూపించలేకపోయాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇటీవల ముగిసిన టీ 20 వరల్డ్ కప్ లో అస్సలు ఊహించని రీతిలో సూపర్ 12 కు కూడా చేరకుండానే వెస్ట్ ఇండీస్ టోర్నీ నుండి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీని రెండు సార్లు గెలుచుకున్న టీం గా చరిత్ర సృష్టించిన వెస్ట్ ఇండీస్ కు ఊహించని షాక్ తగిలింది. చిన్న జట్లతో కూడా పోటా పోటీగా ఆడడం మరియు స్కాట్లాండ్ చేతిలో ఓటమి చెందడం లాంటి విషయాలు ఆ జట్టు విశ్వాసాన్ని దెబ్బతీశాయి. టీ 20 వరల్డ్ కప్ లో జట్టును నడిపించడంలో కెప్టెన్ గా మరియు ప్లేయర్ గా నికోలస్ పూరన్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

ఈ ఫలితానికి ఇప్పుడు నికోలస్ పూరన్ వైట్ బాల్ కెప్టెన్ గా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం టీ 20 లలో వైస్ కెప్టెన్ గా రావుమన్ పావెల్ ఉన్నాడు. వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు పావెల్ ను కెప్టెన్ గా ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి పావెల్ ఏ మేరకు ఆకట్టుకుంటాడు అన్నది తెలియాలంటే కొన్ని మ్యాచ్ లు అయినా చూడాల్సిందే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: